Jammi Chettu: దసరా నాడు అదృష్టాన్ని తెచ్చే జమ్మి శ్లోకం.. పూజ సమయంలో ఇది రాయడం అస్సలు మర్చిపోవద్దు!

ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు దసరా వేడుకలను జరుపుకుంటున్నారు. దసరా పండగ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది జమ్మి చెట్టు, జమ్మి పూజ. పురాణాలలో  దసరా రోజున జమ్మి చెట్టు పూజకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది.  దీనిని శమీ పూజ కూడా అంటారు. 

New Update
jammi chettu

jammi chettu

Jammi Chettu: ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు దసరా వేడుకలను జరుపుకుంటున్నారు. ఇక దసరా పండగ అంటేనే ముందుగా అందరికీ గుర్తొచ్చేది జమ్మి చెట్టు, జమ్మి పూజ. పురాణాలలో  దసరా రోజున జమ్మి చెట్టు పూజకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది.  దీనిని శమీ పూజ కూడా అంటారు. 

పురాణాల ప్రకారం..  జమ్మి చెట్టును దుర్గాదేవి ప్రతి  రూపంగా భావిస్తారు. కావున దసరా పండగ రోజున జమ్మి చెట్టుకు పూజ చేయడం వల్ల కష్టాలు తొలగిపోయి, విజయం, శుభాలు కలుగుతాయని విశ్వాసం. పండగ రోజున ఊరంతా కలిసి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్లి.. చెట్టుకు పూజలు నిర్వహిస్తారు.  అయితే జమ్మి పూజ  తర్వాత..  ఒక కాగితం పై జమ్మి  శ్లోకాన్ని రాసి.. దానిని జమ్మి కొమ్మలకు కడితే  కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం. మరి ఆ శ్లోకం ఏంటో ఇక్కడ తెలుసుకోండి..

జమ్మి శ్లోకం

శమీ శమయతే పాపం
శమీ శత్రు వినాశని
అర్జునస్య ధనుర్​ర్థారి
రామస్య ప్రియదర్శిని

ఈ శ్లోకం అర్థం..   శమీ చెట్టు పాపాలను, శత్రువులను నాశనం చేస్తుంది. అర్జునుడి ధనుస్సును ధరించింది, శ్రీరాముడికి ప్రియమైనది అని అర్థం.  ఈ శ్లోకం రాసిన తర్వాత.. శ్లోకాన్ని ఒకసారి పఠించాలి. ఆ తర్వాత మీరు పేరు, గోత్రం, భార్యాపిల్లల పేర్లు రాసి.. మీ కోరికలు నెరవేరాలని అమ్మవారిని ప్రార్థించండి. 

జమ్మి  చెట్టు  పూజ విధానం 

జమ్మి చెట్టును అమ్మవారి ప్రతిరూపంగా భావించి.. పసుపు, కుంకుమ, అక్షింతలతో పూజించాలి.  అమ్మవారికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి . హారతి ఇవ్వాలి. ఆ తర్వాత శ్లోకాన్ని చదువుతూ  చెట్టు చుట్టూ మూడు ప్రదక్షణలు చేయాలి. పూజ అనంతరం జమ్మి ఆకులను బంగారంగా భావించి..  ఒకరికొకరు చేతిలో పెట్టుకోవాలి. చిన్నవారు పెద్ద చేతిలో బంగారాన్ని ఉంచి ఆశీర్వాదం తీసుకోవాలి.   జమ్మి ఆకులను ఇంట్లోని పూజ గదిలో, బీరువాలో, పర్సుల్లో పెట్టుకోవడం వల్ల  లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని నమ్ముతారు. 

Also Read: Vijayadashami 2025: విజయదశమి శుభ ముహూర్తం.. ఈ సమయంలో పూజ చేస్తే అన్నీ విజయాలే !

Advertisment
తాజా కథనాలు