Banana Black Pepper Benefits: అరటిపండుపై మిరియాల పొడి వేసుకుని తింటే.. ఆ రోగాలన్నీ పరార్!

ప్రతిరోజూ ఉదయం అరటిపండు, నల్ల మిరియాలు కలిపి తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. నెలపాటు పాటిస్తే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అరటిపండులో ఫైబర్, నల్ల మిరియాలు ఎంజైమ్‌ల విడుదలను పెంచుతాయి. ఈ రెండూ కలిసి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

New Update
Black pepper and banana

Black pepper and banana

Banana Black Pepper Benefits: అరటిపండు ఒక ఉష్ణ మండలపు పండు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాలను కలిగి ఉంటుంది. అరటిపండులో ముఖ్యంగా పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బి6 పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని , జీర్ణక్రియను మెరుగుపరచడంలో, శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో సహాయపడతాయి. అరటిపండును పచ్చిగా లేదా ఇతర వంటకాలలో, స్మూతీలలో, డెసర్ట్‌లలో కూడా ఉపయోగించవచ్చు. దీని ప్రత్యేకమైన రుచి, సులభంగా లభించడం వల్ల ఇది అనేక దేశాల్లో రోజువారీ ఆహారంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అయితే కరోనా మహమ్మారి తర్వాత ప్రజలు ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి వివిధ రకాల ఆహార పద్ధతులను అనుసరిస్తున్నారు. ఆ విషయాల గురించి కొన్ని ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

శరీరానికి ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ..

ఆయుర్వేదంలో అద్భుతమైన హోం రెమెడీగా పేర్కొనే ఒక చిట్కా ఇప్పుడు సూపర్‌ఫుడ్‌గా ప్రాచుర్యం పొందింది. అదే.. అరటిపండు, నల్ల మిరియాలు కలిపి తీసుకోవడం. ప్రతిరోజూ ఉదయం ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కా ఒక నెలపాటు పాటిస్తే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుందని వారు సూచిస్తున్నారు. అరటిపండులో ఫైబర్, నల్ల మిరియాలు ఎంజైమ్‌ల విడుదలను పెంచుతాయి. ఈ రెండూ కలిసి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలకు ఇది మంచి పరిష్కారం. నల్ల మిరియాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శరీరానికి ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వాటి నుంచి రక్షిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఈ చిట్కా ఒక అద్భుతమైన పరిష్కారం. అరటిపండు శరీరానికి శక్తినిస్తుంది. నల్ల మిరియాలు జీవక్రియను వేగవంతం చేసి, శరీరంలో కొవ్వును త్వరగా కరిగిస్తాయి. 

ఇది కూడా చదవండి:మనుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెంచడంలో శిలాజిత్.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

నల్ల మిరియాలు (Black pepper) ప్రపంచంలోనే అత్యంత విస్తృతంగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో ఒకటి. ఇవి మిరియాల మొక్కల ఎండిన పండ్ల నుంచి లభిస్తాయి. వీటిని సుగంధ ద్రవ్యాల రాజు అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని కేరళలో వీటిని ఎక్కువగా పండిస్తారు. పురాతన కాలం నుంచి ఆహారంలో రుచి, ఘాటు కోసం వీటిని వాడుతున్నారు. ఆయుర్వేదంలో కూడా నల్ల మిరియాలను ఔషధంగా ఉపయోగిస్తారు. వీటిలోని పైపెరైన్ అనే రసాయనం వల్ల ఆహారానికి ఘాటైన రుచి వస్తుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నల్ల మిరియాలు జీర్ణక్రియకు సహాయపడటంతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. వీటిని పొడిగా, లేదా గింజలుగా వివిధ వంటకాల్లో ఉపయోగిస్తారు. ఈ రెండూ కలిపి తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు, ఇది బరువు నియంత్రణలో సహాయపడుతుంది. అరటిపండులోని విటమిన్లు, నల్ల మిరియాలలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి అంతర్గతంగా పోషణను అందిస్తాయి. ఈ రెమెడీ శరీరం నుంచి విషపదార్థాలను తొలగించి, చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతుంది. అరటిపండులో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లం సెరోటోనిన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. నల్ల మిరియాలు మానసిక అలసటను తగ్గిస్తాయి. ఇది ఒత్తిడిని దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి:టీ తాగుతూ అలా చేసే అలవాటుందా..? అయితే మీకు చావు ఖాయం.. షాకింగ్ న్యూస్!

Advertisment
తాజా కథనాలు