/rtv/media/media_files/2025/09/09/gut-health-2025-09-09-19-10-15.jpg)
Gut Health
కొందరు తెలిసో, తెలియక ఫుడ్ విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. దీనివల్ల వారి లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. పోషకాలు ఉండే ఆహారం తీసుకుంటేనే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. అయితే డైలీ లైఫ్‌లో ఎలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల లైఫ్ స్పాన్ తగ్గిపోతుందో ఈ స్టోరీలో చూద్దాం.
అల్పాహారం తీసుకోకపోవడం
చాలా మంది బిజీ షెడ్యూల్ లేదా ఆలస్యంగా తినడం వల్ల బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారు. దీనివల్ల కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం పూట తప్పకుండా బ్రేక్‌ఫాస్ట్ తినాలి. అప్పుడే రోజంతా యాక్టివ్‌గా ఉంటారని నిపుణులు అంటున్నారు. ఆలస్యంగా నిద్ర లేచినా కూడా తప్పకుండా టిఫిన్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.
కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం
కొందరు కాఫీ ఎక్కువగా తీసుకుంటారు. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల కడపు నొప్పి వస్తుందని, ముఖ్యంగా జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. కొన్నిసార్లు విరేచనాలు కూడా అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తగినంత మోతాదులో మాత్రమే కెఫిన్ ఉండే కాఫీలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
తొందరగా తినడం
సమయం లేదని కొందరు తొందరగా తింటుంటారు. ఇలా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. తక్కువగా నమలడం, ఎక్కువగా గాలి మింగడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. దీంతో ప్రేగులపై ఒత్తిడి పడి గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తగినంత నీరు తీసుకోకపోవడం
జీర్ణక్రియ సజావుగా సాగడానికి సరైన హైడ్రేషన్ అవసరం. తగినంత నీరు తీసుకోకపోతే ప్రేగు సమస్యలు వస్తాయి. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీరు తాగాలని నిపుణులు అంటున్నారు.
నొప్పి నివారణ మందులు వాడటం
ఇబుప్రోఫెన్ వంటి నొప్పిని నివారించే మందులను ఎక్కువగా యూజ్ చేయకూడదు. వీటివల్ల అల్సర్లు, అధిక వాపు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
అధిక చక్కెర, ప్రాసెస్ చేసిన ఫుడ్స్
స్వీట్, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటివల్ల గట్ మైక్రోబయోమ్ తగ్గుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయని, ముఖ్యంగా జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
మద్యం సేవించడం
పదే పదే తాగడం వల్ల గట్ లైనింగ్ చెదిరిపోతుంది. మంచి బ్యాక్టీరియా తగ్గుతుంది. లీకీ గట్ సిండ్రోమ్ అభివృద్ధి చెందే ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎక్కువగా మద్యాన్ని సేవించకూడదని నిపుణులు చెబుతున్నారు.
తక్కువ ఫైబర్ తీసుకోవడం
ఆహారంలో తగినంత ఫైబర్ లేకపోతే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందదు. దీనివల్ల మలబద్ధకం వస్తుంది. అలాగే రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
దీర్ఘకాలిక ఒత్తిడి
ఒత్తిడి హార్మోన్లు మెదడును మారుస్తాయి. వీటివల్ల కడుపు తిమ్మిరి, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
తగినంత నిద్ర లేకపోవడం
నిద్రలేమి అలవాట్లు పేగు సమస్యలు వస్తాయి. జీర్ణ సమస్యలు రావడంతో రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుంండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.