/rtv/media/media_files/2025/07/25/goddess-of-poverty-2025-07-25-21-29-51.jpg)
goddess of poverty (Twitter)
తెలిసో తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని ఉంటుందని పండితులు అంటున్నారు. పొరపాటున దరిద్ర దేవత కనుక ఇంట్లో ఉంటే అదృష్టం ఉండదు, ప్రతీ విషయంలో ఆటంకం, పేదరికం, నష్టాలు, ఆర్థిక సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే ఎలాంటి అలవాట్ల వల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చోని ఉంటుందో మీకు తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.
ఇది కూడా చూడండి: Viral News: అక్కడేలా పెట్టావురా..! గోడపైకి ఎక్కిన కార్.. చూస్తే షాకే..
అపరిశుభ్రత
ఇల్లు చిందరవందరగా ఉండటం, వస్తువులు ఎక్కడపడితే అక్కడ పడేయడం, బట్టలు, పుస్తకాలు క్రమం లేకుండా ఉండటం, ఇంటిని రోజూ శుభ్రం చేయకపోవడం, పగిలిన అద్దాలు, విరిగిన కుర్చీలు, పాడైన గడియారాలు వంటివి ఇంట్లో ఉంచుకోవడం, మురికి బట్టలు కుప్పలుగా వేయడం, ఇంట్లో దుర్వాసనలు రావడం వంటివి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయని నమ్ముతారు.
ఇది కూడా చూడండి:OTT: పోర్న్ కంటెంట్ కి చెక్... ఆ 25 ఓటీటీ యాప్‌లపై కేంద్రం నిషేధం
చెడు ఆర్థిక అలవాట్లు
అవసరం లేని వాటికి విపరీతంగా ఖర్చు చేయడం, పొదుపు చేయకపోవడం, అప్పులు చేయడం, తీర్చకపోవడం, డబ్బును అగౌరవంగా చూడటం, పాదాలతో తొక్కడం, నిర్లక్ష్యంగా పడేయడం వంటివి చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు.
ప్రతికూల ఆలోచనలు
ఎప్పుడూ నిరాశతో ఉండటం, ప్రతి విషయానికి ప్రతికూలంగా ఆలోచించడం, అదృష్టం లేదని నిందించుకోవడం, ఏ పని చేయకుండా సోమరిగా ఉండటం, బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం, ఇంట్లో నిత్యం గొడవలు, అరుపులు, కోపాలు, శాంతి లేకపోవడం వంటి కారణాల వల్ల కూడా ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది.
ఇది కూడా చూడండి: Crime: హైదరాబాద్ లో ఘోరం.. బర్త్ డే రోజు భార్య పీకకోసి..ముక్కలు ముక్కలుగా
సాంప్రదాయాలు పాటించకపోవడం
సూర్యోదయం తర్వాత నిద్ర లేవడం, సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడ్చడం లేదా చెత్త బయట పారవేయడం, లక్ష్మీదేవిని పూజించడంలో నిర్లక్ష్యం వహించడం, శుక్రవారం వంటి పవిత్రమైన రోజులలో నియమాలు పాటించకపోవడం వల్ల ఇంట్లోకి దరిద్ర దేవత వస్తుందని పండితులు చెబుతున్నారు. సూర్యోదయం సమయాల్లో ఇంట్లోకి లక్ష్మీ దేవి వస్తుందని, ఈ సమయాల్లో ఇంటిని ఊడ్చి బయట వేయడం వల్ల లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్లిపోతుందని పండితులు చెబుతున్నారు.
గోళ్లు కత్తిరించుకోవడం
సాయంత్రం, రాత్రి సమయాల్లో గోళ్లు కత్తిరించుకోవడం, జుట్టు దువ్విన వెంట్రుకలు బయట వేయడం వంటివి చేయడం వల్ల దరిద్ర దేవత తిష్ట వేసుకుని ఇంట్లో ఉంటుందని పండితులు చెబుతున్నారు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.