Ganesh Nimajjanam 2025: గణేష్ నిమజ్జన సమయంలో ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

సెప్టెంబర్ 6, 2025న అనంత్ చతుర్దశి రోజున దేశవ్యాప్తంగా గణపతి బప్పాకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. నిమజ్జనం కోసం విగ్రహాన్ని తీసుకెళ్లేటప్పుడు.. బప్పా ముఖం ఇంటి వైపు ఉండేలా చూసుకోవాలి. మూడు సార్లు అపసవ్య దిశలో ప్రదక్షిణ చేయాలి.

author-image
By Vijaya Nimma
New Update
Ganesh immersion

Ganesh Immersion

గణేష్ నిమజ్జనం అనేది పది రోజుల గణేష్ చతుర్థి ఉత్సవాల ముగింపును సూచించే ఒక ముఖ్యమైన హిందూ సంప్రదాయం. ఈ పండుగలో భక్తులు వినాయకుని మట్టి విగ్రహాలను పది రోజుల పాటు పూజిస్తారు. ఆ తర్వాత చివరి రోజున ఈ విగ్రహాలను నదులు, సముద్రాలు లేదా ఇతర నీటి వనరులలో నిమజ్జనం చేస్తారు. ఈ నిమజ్జనం విగ్రహంలో ఉన్న దేవతా శక్తిని తిరిగి ప్రకృతిలోకి విలీనం చేయడం, అలాగే దుఃఖాలు, కష్టాలను తనతో పాటు తీసుకువెళ్లిపోవాలని కోరుకోవడం వంటి వాటికి ప్రతీకగా భావిస్తారు. ఈ ప్రక్రియను ఘనంగా ఊరేగింపులు, డప్పులు, నృత్యాలతో జరుపుకుంటారు. ఇది ఆధ్యాత్మిక ఆనందం, సాంస్కృతిక వైభవం కలగలిసిన ఒక వేడుక. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 6 శనివారం 2025న అనంత్ చతుర్దశి రోజున గణపతి బప్పాకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 27 నుంచి గణపతి బప్పా 10 రోజులు భక్తుల పూజలు అందుకున్నారు. గణేశ్‌ నిమజ్జనం ఒక పవిత్రమైన ప్రక్రియ. దీనికి కొన్ని ప్రత్యేక నియమాలు, ఆచారాలు ఉన్నాయి. భక్తులు ఈ నియమాలను పట్టించుకుంటే బప్పా ఆశీర్వాదం పొందవచ్చు. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.

ముఖ్యం నియమాలు మరియు ఆచారాలు:

దిశ: నిమజ్జనం కోసం విగ్రహాన్ని తీసుకెళ్లేటప్పుడు.. బప్పా ముఖం ఇంటి వైపు ఉండేలా చూసుకోవాలి. ఇది బప్పా ఇంటికి ఆశీర్వాదం ఇవ్వడానికి సహాయపడుతుంది.

ఆరతి-సామగ్రి: నిమజ్జనానికి ముందు బప్పాకు చివరి ఆరతి ఇవ్వాలి. ఇందుకోసం పండ్లు, పువ్వులు, పసుపు, కుంకుమ, 21 దూర్వ, మిఠాయి వంటి పూజా సామగ్రిని ఉపయోగించాలి.

ఎరుపు వస్త్రం: ఒక ఎరుపు వస్త్రంలో పసుపు, బియ్యంతో కొబ్బరికాయను లేదా వక్కను పెట్టి.. దానిని జాగ్రత్తగా తిజోరీలో పెట్టాలి. ఇది ఇంట్లో సిద్ధి-వృద్ధి, శుభ-లాభాలను తీసుకొస్తుంది.

ప్రసాదం: నిమజ్జన సమయంలో బప్పాకు 5 మోదకాలు సమర్పించి.. వాటిని అందరికీ పంచాలి.

పర్యావరణానికి అనుకూలమైన నిమజ్జనం: వీలైనంత వరకు ఇంట్లోనే శుభ్రమైన పాత్రలో నీటితో నిమజ్జనం చేయడం మంచిది. ఆ తర్వాత ఆ నీటిని చెట్ల వద్ద పోయాలి.

మంత్రాలు: నిమజ్జనానికి ముందు మూడు సార్లు అపసవ్య దిశలో ప్రదక్షిణ చేయాలి. ఆ తర్వాత భక్తితో గణపతి బప్పా మోరియా పూడ్చ్యా వర్షీ లవ్కర్ యా అని జయజయధ్వానాలు చేయాలి.

ఇది కూడా చదవండి: వర్షాకాలంలో మంచి ఆరోగ్యం కావలా..? ఈ ఆహార చిట్కాలు మీ కోసమే!!

అనంత్ చతుర్దశి నాడు గణేశ్‌ నిమజ్జనానికి మూడు ముఖ్యమైన శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఉదయం: 7:36 AM నుంచి 9:10 AM వరకు, మధ్యాహ్నం: 12:19 PM నుంచి 5:02 PM వరకు, సాయంత్రం: 6:37 PM నుంచి 8:02 PM వరకు ఉంటుంది. గణేష్ నిమజ్జనం పర్యావరణంపై చూపుతున్న ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని.. పర్యావరణహిత నిమజ్జనం వైపు మొగ్గు చూపుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాల బదులు, మట్టి, సహజ రంగులతో చేసిన విగ్రహాలను ఉపయోగిస్తున్నారు. అలాగే నిమజ్జనం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కృత్రిమ ట్యాంకులను ఉపయోగిస్తున్నారు. ఇది పవిత్రమైన సంప్రదాయాన్ని పాటిస్తూనే.. ప్రకృతిని రక్షించుకోవడానికి సహాయపడుతుంది. ఈ నియమాలను పాటించడం ద్వారా భక్తులు బప్పా ఆశీర్వాదం పొందుతారు, ఈ పండుగను మరింత పవిత్రంగా జరుపుకున్నవాళ్లు అవుతారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

ఇది కూడా చదవండి: సెప్టెంబర్‌లో ఆ రాశుల వారికి డేంజర్.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్!

Advertisment
తాజా కథనాలు