/rtv/media/media_files/2025/04/23/BvhpwyAIT76ftyItWUEh.jpg)
Fruits sweet
Fruits: వేసవిలో పండ్ల వినియోగం విపరీతంగా పెరుగుతుంది. శరీరానికి అవసరమైన తేమను కలిగి ఉండే పండ్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే సరైన పండ్లను ఎంచుకోవడంలో చాలామంది పొర పాట్లు చేస్తుంటారు. ఫలితంగా ఇంటికి తీసుకువెళ్లిన పండ్లు పచ్చిగా ఉండడం, రుచి తక్కువగా ఉండటం వంటి సమస్యలు ఎదురవుతాయి. దానిమ్మ వంటి పండ్లు కొనేటప్పుడు పైభాగం స్వల్పంగా తెరిచి ఉంటే అది తియ్యగా ఉన్నని భావించవచ్చు. మిగతా పండ్ల విషయంలో కూడా కొన్ని సరళమైన లక్షణాలను గమనించడం ద్వారా తియ్యని ఫలాలను ఎంచుకోవచ్చు.
ఆకుపచ్చని ఆకులు ఉండాలి:
పుచ్చకాయకు చక్కటి చారలు, గట్టి పొడవైన ఆకారం ఉంటే అది ఎక్కువగా తీపిగా ఉండే అవకాశం ఉంది. అలాగే దానిని కొడితే ఖాళీగా అనిపించకూడదు. నారింజను కొనేటప్పుడు దాని రంగును గమనించండి. ముదురు రంగు, కొంత మెత్తగా ఉంటే అది తీపిగా, పుల్లగా ఉండే అవకాశం ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ విషయంలో కూడా ఆకుపచ్చని ఆకులు ఉండాలి. ఇది ఫలాన్ని తాజాగా ఉందని సూచిస్తుంది.
ఇది కూడా చదవండి: వేసవిలో అమ్మాయిలు దీనిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి
బొప్పాయి విషయానికి వస్తే పూర్తిగా పసుపు రంగులో ఉంటే మాత్రమే తియ్యటి బొప్పాయి అని గుర్తించాలి. పచ్చని రంగులో ఉన్న బొప్పాయిలు ఎక్కువసార్లు పూర్తిగా పండవు. ఈ చిన్నచిన్న సూచనలతోనే మనం సరైన, రుచికరమైన పండ్లను ఎంచుకోవచ్చు. పైగా మార్కెట్‌కి వెళ్లే ప్రతిసారీ కాస్తంత గమనికతో చూస్తే డబ్బు కూడా వృథా కాదు. ముఖ్యంగా వేసవిలో మంచి నీటి శాతం ఉన్న పండ్లు తినడం శరీరాన్ని హైడ్రేట్ చేసి, వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: టాయిలెట్లలో డ్యూయల్ ఫ్లష్‌లు ఎందుకు ఉంటాయి?
( home-tips | home tips in telugu | latest-news | telugu-news )