ప్రస్తుతం చలి తీవ్రత బీభత్సంగా ఉంది. చలి గాలి వల్ల చేతులు, కాళ్లు, పాదాలు పగుళ్లు వస్తుంటాయి. దీంతో అవి అందవిహీనంగా కనిపిస్తాయి. కొందరికి పాదాలు నొప్పిగా ఉంటాయి. కనీసం అడుగు తీసి కూడా అడుగు వేయలేరు. ఇలా పాదాల దగ్గర పగుళ్లు రావడాన్ని క్రాక్డ్ హీల్స్ అంటారు. అయితే ఈ సీజన్‌లో చాలా మంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీనిని తగ్గించుకోవాలని ఎన్ని క్రీములు రాసిన కూడా పాదాలు తేమగా మారవు. మరి ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఏం చేయాలో చూద్దాం. ఇది కూడా చూడండి: Makara Sankranti: సంక్రాంతికి గాలిపటాలు ఎందుకు ఎగరేస్తారో తెలుసా..దాని వెనుక ఉన్న కథేంటంటే! మాయిశ్చరైజింగ్ చలికాలంలో పాదాలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. గ్లిజరిన్ ఉండే మాయిశ్చరైజర్‌ను రాత్రిపూట పాదాలకు అప్లై చేయాలి. ఇది చర్మానికి తేమను అందించి పగుళ్లను తగ్గిస్తుంది. మాయిశ్చరైజింగ్ వాడని వాడని వారు కొబ్బరి లేదా ఆలివ్ నూనెను అయినా కూడా వాడవచ్చు. ఇది కూడా చూడండి: డాకు మహారాజ్ కు ఏపీ హైకోర్టు బిగ్ షాక్.. టికెట్ ధరల పెంపుకు బ్రేక్! గోరువెచ్చని నీటితో పాదాలు పాదాలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే అవి పగుళ్లు రావు. అవసరం అయితే పాదాలకు నిమ్మకాయ పెట్టి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సమస్య తీరిపోతుంది. ఇది కూడా చూడండి: Sreeleela: సైఫ్ అలీఖాన్ కొడుకుతో శ్రీలీల ఫొటోలు వైరల్.. కారణం అదేనా? స్క్రబ్‌తో క్లీనింగ్ పాదాలను అప్పుడప్పుడు అయిన స్క్రబ్‌తో క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాల దగ్గర పగుళ్లు తగ్గుతాయి. అలాగే మృదువుగా తయారవుతాయి. ఇది కూడా చూడండి: Poonam Dhillon : ఎంతకు తెగించార్రా.. బాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో దొంగతనం గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.