Eating Oats: వామ్మో.. ఓట్స్ ఈ సమయంలో తింటే ఇంత ప్రమాదమా.. మీరు డేంజర్‌లో పడినట్లే!

ఓట్స్‌ను రాత్రి సమయాల్లో కాకుండా ఉదయం పూట తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి సమయాల్లో ఓట్స్ తింటే జీర్ణ సమస్యలు, గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

New Update
Oatsbreakfast3

Oats

ఓట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇందులో ఫైబర్, పోషకాలు, ప్రొటీన్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా బరువు తగ్గాలని అనుకునే వారు ఎక్కువగా ఓట్స్ తింటారు. సాధారణంగా ఓట్స్ తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే కొందరు సమయం కానీ వేళలో ఓట్స్‌ను అధికంగా తింటారు. ఎంత ఆరోగ్యానికి మంచివి అయినా సరైన వేళలో తింటేనే ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. అయితే ఓట్స్ ఏ సమయంలో తినడం ఆరోగ్యానికి మంచిదో మీకు తెలియాలంటే ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి. 

ఇది కూడా చూడండి: Sleep Time: రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతున్నారా.. అయితే ఇది మీ కోసమే!

ఈ సమయాల్లో అయితే అసలు..

రాత్రి సమయాల్లో వంట చేసుకునే ఓపిక లేని వారు ఎక్కువగా ఓట్స్ తీసుకుంటారు. ఇందులో పీచు అధికంగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి మంచిదే. కానీ రాత్రిపూట తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జీర్ణక్రియ దెబ్బతింటుందని అంటున్నారు. మితంగా రాత్రి సమయాల్లో తింటే పర్లేదు. కానీ అధికంగా తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయని అటున్నారు. రాత్రి సమయాల్లో కంటే ఉదయం పూట ఓట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. రాత్రి సమయాల్లో అంటే 7 గంటలకు అలా ఓట్స్ తినవచ్చు. కానీ అంత కంటే ఆలస్యంగా తింటే తప్పకుండా ప్రమాదాల బారిన పడతారని అంటున్నారు. ఓట్స్ రాత్రి సమయాల్లో తింటే సరిగ్గా జీర్ణం కాక నిద్రపట్టదని, దీంతో నిద్రలేమి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఓట్స్ రాత్రి సమయాల్లో కార్బోహైడ్రేట్లుగా మారతాయి. దీనివల్ల బాడీలో కొవ్వు పెరిగే అవకాశం ఉందని  నిపుణులు అంటున్నారు. 

తీపి వేసుకుని తినకూడదని..

సాధారణంగా ఓట్స్ టెస్ట్ లెస్‌గా ఉంటాయి. దీంతో కొందరు తీపి కోసం చక్కెర, బెల్లం, తేనె, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వంటివి యాడ్ చేస్తారు. వీటిని యాడ్ చేసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. అలాగే తీపి వల్ల మధుమేహం కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓట్స్‌లో పంచదార లేకుండా పాలు లేదా పెరుగుతో మాత్రమే కలిపి తినాలి. దీనివల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు వస్తాయని నిపుణులు అంటున్నారు. అలాగే కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా అసలు తినకూడదని అంటున్నారు. దీనివల్ల ఈ సమస్య పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఎప్పుడు తిన్నా కూడా డిన్నర్ కంటే.. బ్రేక్‌ ఫాస్ట్‌గా మాత్రమే ఓట్స్ తినడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: Pistachios: పిస్తాపప్పు విటమిన్ లోపాన్ని తొలగిస్తుందా..? తినడానికి సరైన సమయం తెలుసా..!!

Advertisment
తాజా కథనాలు