/rtv/media/media_files/2025/04/21/dontsleep1-309337.jpeg)
sleep
మారిన జీవనశైలి వంటి కారణాల వల్ల కొందరు రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా ఉండటం వల్ల ఎక్కువ మంది అర్థరాత్రి లేదా పగటి పూట నిద్రపోతున్నారు. ఎంత ఆరోగ్యమైన ఫుడ్ తీసుకున్నా కూడా రాత్రిపూట సరైన సమయానికి నిద్రపోకపోతే అనారోగ్య సమస్యలను కోరి తెచ్చుకున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి పూట గరిష్టంగా 11 గంటల వరకు నిద్రపోకుండా ఉండవచ్చు. అంతకంటే ఆలస్యంగా నిద్రపోతే తప్పకుండా దీర్ఘకాలిక సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. కేవలం శారీరక మాత్రమే కాకుండా మానసిక సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే రాత్రి పూట 11 తర్వాత నిద్రపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? ఏ సమయంలో నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది? పూర్తి వివరాలు తెలియాలంటే మీరు ఈ ఆర్టికల్‌పై ఓ లుక్కేయాల్సిందే.
ఇది కూడా చూడండి: Pregnancy: గర్భం ధరించడానికి సరైన సమయం తెలుసా..? ఓవ్యులేషన్‌పై కొత్త విషయాలు మీ కోసం
ఆలస్యంగా నిద్రపోవడం వల్ల..
ప్రతీ మనిషికి రోజుకి 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. రాత్రిపూట సరిగ్గా నిద్రలేకపోతే రోజంతా నీరసంగా అనిపిస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒత్తిడి, ఆందోళన, చిరాకు, ఏకాగ్రత వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఎప్పుడో ఒకసారి రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ డైలీ ఆలస్యంగా నిద్రపోతుంటే మాత్రం తప్పకుండా అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట 11 తర్వాత నిద్రపోతే బరువు పెరుగుతారు. అలాగే మెదడు పనితీరు తగ్గిపోతుంది. ముఖ్యంగా జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. చిరాకుగా ఉంటుంది. ఏ పని మీద అంతగా ఇంట్రెస్ట్ పెట్టలేరు. ప్రతీ విషయంలో ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అన్నింటి కంటే ముఖ్యంగా జట్టు అతిగా రాలిపోతుంది. చర్మం నల్లగా మారుతుంది. డార్క్ సర్కిల్స్ వస్తాయి. ఇంతకు ముందు ఉన్న చర్మ కాంతి పూర్తి తగ్గిపోతుంది. అసలు స్కిన్‌లో గ్లోనెస్ ఉండదు. కాబట్టి ఆలస్యంగా కాకుండా తొందరగా నిద్రపోవడం అలవాటు చేసుకోండి.
ఇది కూడా చూడండి: Sweat Smell: వర్షాకాలంలో చెమట వాసనతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిట్కాలతో ఉపశమనం
ఏ సమయంలో నిద్రపోవాలంటే?
రాత్రిపూట ఆలస్యంగా కాకుండా తొందరగా నిద్రపోవడం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా 9 లేదా 10 గంటలకు నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతే ఉదయం లేటుగా నిద్ర లేవాల్సి వస్తుంది. అలా కాకుండా ఉదయం సూర్యోదయానికి ముందే లేవడం అలవాటు చేసుకోండి. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. ఉదయం తొందరగా లేవడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటి ఒత్తిడి, ఆందోళన రాదని నిపుణులు చెబుతున్నారు. తొందరగా నిద్రపోవడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఏ విషయాన్ని అయినా కూడా సరిగ్గా ఆలోచించగలరు. రోజంతా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. దీంతో ఎలాంటి పనిని అయినా యాక్టివ్‌గా చేయగలరు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.