Water: భోజనానికి ముందు నీళ్లు తాగితే?

భోజనానికి 20 నిమిషాల ముందు లేదా తర్వాత నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. తినక ముందు తిన్న వెంటనే నీరు అధికంగా తాగితే మలబద్ధకం, జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటివి వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

New Update
water125

సాధారణంగా దాహం వేసినప్పుడు నీరు తాగుతుంటారు. ముఖ్యంగా ఏదైనా తిన్న తర్వాత లేదా భోజనం చేసిన తర్వాత నీరు తాగుతారు. కానీ మరికొందరు మాత్రం భోజనానికి ముందు నీరు తాగుతారు. ఇలా తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. భోజనానికి ముందు నీరు తాగితే ఎక్కువగా ఫుడ్ తినలేరు. ఆకలి అంతా చచ్చిపోతుంది. అలాగే తిన్న ఆహారం అసలు జీర్ణం కాదు. దీనివల్ల జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

ఇది కూడా చూడండి: 8 మంది ఉన్నా.. బీజేపీపై ఎమ్మెల్సీ కవిత ఉగ్రరూపం!

20 నిమిషాల ముందు..

భోజనం చేయక ముందే కాదు.. చేసిన తర్వాత కూడా తాగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నానరు. తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట. అలాగే బరువు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి తిన్న వెంటనే ఎక్కువగా నీరు తాగవద్దు.

ఇది కూడా చూడండి: US: ట్రంప్‌ బాధ్యతలు చేపట్టకముందే రాజీనామా చేస్తా: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌!

ఫుడ్ కారంగా ఉండటం వల్ల ఒకవేళ తాగాలనిపిస్తే మాత్రం తక్కువగా తాగాలి. భోజనానికి 20 నిమిషాల ముందు లేదా తర్వాత అయిన ఎక్కువగా నీరు తాగవచ్చు. కొందరు భోజనం చేసిన గంట తర్వాత కూడా పూర్తిగా నీరు తాగరు. దీనివల్ల తినే ఫుడ్ జీర్ణం కాకపోవడంతో పాటు మలబద్ధకం, కడుపు ఉబ్బరం, కడుపులో మంట వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: BIT Coin: 24 గంటల్లో 3.82 లక్షల ప్రాఫిట్‌

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల లిస్ట్ రెడీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు