Health Tips: తొక్కే కదా అని తీసి పారేయద్దు బ్రో.. ఈ పండ్ల తొక్కలు తింటే.. ఆరోగ్యానికి బోలెడన్నీ లాభాలు

యాపిల్ పండుతో పాటు తొక్కలో  కూడా ఎన్నో పోషకాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఈ తొక్కలో పీచు పదార్థం, విటమిన్‌ సి మెండుగా ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గించి బరువు నియంత్రణలో ఉండేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

New Update
Apple peel

Apple peel

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, పోషకాలు అన్ని కూడా ఉంటాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఈ పండ్లు సహాయపడతాయి. అయితే కొన్ని పండ్లకు ఉన్న తొక్కలు కొందరు తింటారు. మరికొందరు తినరు. నిజానికి పండ్లతో పాటు తొక్కల్లో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. కొందరు పండ్లను జస్ట్ కడిగి తినేస్తారు. మరికొందరు అయితే యాపిల్ వంటి పండ్లకు కూడా తొక్కలను తీస్తారు. అయితే పండ్లతో పాటు తొక్కలు తినడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఈ స్టోరీలో చూద్దాం. 

ఈ పండు తొక్కలతో..

రోజుకి ఒక యాపిల్ తిని డాక్టర్ దగ్గరకు వెళ్లక్కర్లేదని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే యాపిల్ పండుతో పాటు తొక్కలో  కూడా ఎన్నో పోషకాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఈ తొక్కలో పీచు పదార్థం, విటమిన్‌ సి మెండుగా ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గించి బరువు నియంత్రణలో ఉండేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొందరికి బాడీలో కొవ్వు ఉంటుంది. ఈ చెడు కొవ్వులను తగ్గించడంలో యాపిల్ తొక్కలు బాగా ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు. అలాగే యాపిల్ పండ్ల తొక్కలు అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఈ తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది.

 ఇది కూడా చదవండి: ఎక్కువ కాలం బతకాలని ఉందా..? అయితే.. వెంటనే ఈ 10 అలవాట్లు మార్చుకోండి!!

ఇది వృద్ధాప్య ఛాయల్ని తగ్గిస్తుంది. దీనివల్ల తొందరగా ముసలితనం రాకుండా యంగ్ లుక్‌లో కనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో కొందరికి నిద్రలేమి అనేది పెద్ద సమస్యగా మారింది. అలసట, ఒత్తిడి అధికంగా ఉండటం వల్ల నిద్ర సమస్యలు వస్తున్నాయి. అలాంటి వారు పండ్ల తొక్కలను కూడా తినడం వల్ల హాయిగా నిద్ర పడుతుందని నిపుణులు అంటున్నారు. ఈ పండ్ల తొక్కల్లో విటమిన్‌ సి, ఫోలేట్, ఫైబర్‌లు ఉంటాయి. ఇవి సెరటోనిన్  హార్మోన్‌ ఉత్పత్తిని పెంచి నిద్ర లేమి సమస్యను తగ్గిస్తాయి. వీటిని బాగా కడిగి తింటే ఎలాంటి సమస్యలు ఉండవని అంటున్నారు. అలాగే పండ్ల తొక్కల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు. 

ఇది కూడా చదవండి: నిద్ర లేకపోవడం, జుట్టు రాలడానికి మధ్య సంబంధం ఏంటో తెలుసా..?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు