Drumstick Leaves: మునగాకుతో మెరవండిలా!

మునగాకు పేస్ట్‌ను ముఖానికి అప్లై చేస్తే మొటిమలు, మచ్చలు అన్ని తొలగి స్కిన్ మెరవడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని చర్మ నిపుణులు చెబుతున్నారు. దీని పౌడర్‌‌ను ముఖానికి స్క్రబ్‌లా కూడా ఉపయోగించవచ్చు.

New Update
Drumstick Leaves face pack

ఆరోగ్యానికి మునగాకు ఎంతో మేలు చేస్తుందనే విషయం తెలిసిందే. అయితే కేవలం ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మునగాకును ముఖానికి అప్లై చేయడం వల్ల యంగ్‌ లుక్‌లో కనిపిస్తారు. ఇందులో విటమిన్ ఏ, సి, ఈ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. మునగాకును మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేస్తే స్కిన్ మెరుస్తుంది. వారానికొకసారి మునగాకును స్కిన్‌కి అప్లై చేస్తే పొడి చర్మ సమస్య అంతా క్లియర్ అవుతుంది. ముఖం చాలా అందంగా కనిపిస్తుంది.

ఇది కూడా చూడండి:  Hyderabad: నేడు నగరంలో భారీ ఎయిర్‌ షో..ఈ  ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

ముఖానికి స్క్రబ్‌లా కూడా..

కేవలం మునగాకు పేస్ట్‌నే కాకుండా ఆకులను ఎండబెట్టి పౌడర్‌లా కూడా తయారు చేసుకోవచ్చు. పౌడర్‌లో కాస్త రోజ్‌వాటర్ కలిపి ముఖానికి స్క్రబ్‌లా ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల మీ ముఖం తెల్లగా, అందంగా మారడం మీరే గమనిస్తారు. మునగాకులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే చర్మంపై ఎలాంటి మొటిమలు, మచ్చలు రాకుండా ఉండటంలో మునగాకు బాగా సహాయపడుతుంది. 

ఇది కూడా చూడండి:Ap Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో వానలు!

మునగాకు పేస్ట్ లేదా పొడిని కేవలం వాడటం వల్ల మాత్రమే చర్మం ఆరోగ్యంగా ఉండదు. మునగాకుని వండుకుని తిన్నా కూడా చర్మం మెరుస్తుంది. అలాగే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. కనీసం వారానికొకసారి అయిన మునగాకును తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: వందే భారత్ స్లీపర్ రైళ్లకు ముహుర్తం ఫిక్స్‌..ఈ మార్గంలోనే తొలి రైలు!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: Fire Accident: తిరుమలలో రన్నింగ్ కారులో మంటలు..భయంతో భక్తులు పరుగులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు