Drinking Water: ఈ వాటర్ తాగితే వారంలోనే శరీరంలో మార్పు ఖాయం

శరీరం ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో సోపు, జీలకర్ర, వాముతో చేసిన నీటిని తాగవచ్చు. ఈ నీరు జీర్ణక్రియ మెరుగుపడటంతోపాటు బరువు తగ్గడానికి, శరీరంలోని మలినాలు తొలగించి.. కిడ్నీలు, కాలేయాలను శుభ్రపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Cumin drink

Healthy Cumin Drink

Healthy Drink : ప్రస్తుం శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.  ఇంట్లోనే చిన్నచిన్న రెమెడీస్ ఫాలో అయితే శరీరాన్ని ఫిట్‌గా ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో సోపు, జీలకర్ర, వాముతో చేసిన నీటిని తాగండి. ఇవి అందరి ఇంటి వంటగదిలో సులభంగా దొరుకుతాయి. ఈ మసాలా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుదని నిపుణులు చెబుతున్నారు. ఈ నీటిని ఒక వారం రోజులు తాగితే  శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగిపోతాయి.

ఇది కూడా చదవండి: విడాకుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అందులో భార్యకు హక్కు!

కిడ్నీలు, కాలేయాలను శుభ్రపరుస్తుంది:

అంతేకాదు ఈ నీరు జీర్ణక్రియ మెరుగుపడటంతోపాటు బరువు తగ్గడానికి మంచిదని అంటున్నారు. సోపు, జీలకర్ర, వాము నీరు శరీరంలో ఉన్న మలినాలు తొలగించడంలో సహాయపడతాయి. దీని వినియోగం శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. అంతేకాదు కిడ్నీలు, కాలేయాలను శుభ్రపరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రింక్‌ని ఎలా తయారుచేయాలో.. దానివల్ల కలిగే ప్రయోజనాలేంటో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. 

Also Read :  ఎర్త్ మ్యాగ్నెట్ వేగంతో మార్పులు..ప్రళయం తప్పదా?

డ్రీగ్‌ తయారు విధానం:

ఈ నీరు తయారు చేయడానికి ముందుగా ఒక పాన్‌లో గ్లాసు నీటిని వేడి చేయాలి. అందులో ఒక చెంచా వాము, మెంతి గింజలు,  జీలకర్ర వేసి మరిగించాలి. నీరు బాగా మరిగిన తర్వాత ఒక గ్లాసులో వడకట్టాలి. మీకు రుచి కాలంటే దానిలో కొద్దిగా తేనెను కల్పుకోవచ్చు. సోపు, జీలకర్ర, వాము నీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటంతో పాటు అధిక రక్తపోటు తగ్గుతుంది. ఇంకా కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది. ఈ నీటిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగనిరోధకశక్తిని బలోపేతం చేస్తుంది.  ఈ మూడు పదార్థాలతో తయారు చేసిన పానీయం  రోజూ  తాగితే శరీరంలో పేరుకుపోయే అదనపు కొవ్వును  తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Video: చిట్టి రోబో బడా దొంగతనం.. 12 రోబోట్‌లను కిడ్నాప్‌ చేసి..!

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

ఇది కూడా చదవండి: ఇవి తింటే బరువు తగ్గడం కన్ఫామ్‌

Advertisment
తాజా కథనాలు