Hair Serum: హెయిర్ సీరమ్ వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త! హెయిర్ సీరమ్ కొనేముందు తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. హెయిర్ సీరమ్‌లో సల్ఫేట్లు, పారాబెన్స్, సిలికాన్లు వంటి రసాయనాలు లేని వాటిని కొనుగోలు చేయాలి. లేకపోతే జుట్టు అధికంగా రాలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Kusuma 08 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి జుట్టు రాలిపోకుండా బలంగా ఉండాలని అమ్మాయిలు ఎక్కువగా హెయిర్ సీరమ్ వాడుతుంటారు. పూర్వం తలకు ఆయిల్ అప్లై చేస్తే ఈ రోజుల్లో అమ్మాయిలు మాత్రం హెయిర్ సీరమ్‌నే ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఈ హెయిర్ సీరమ్‌ను రసాయనాలతో తయారు చేయడం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెయిర్ సీరమ్‌ను కొనుగోలు చేసే ముందు తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మరి అవేంటో చూద్దాం. ఇది కూడా చూడండి: Medak District: కానిస్టేబుల్ కొట్టాడని మనస్తాపంతో.. ఏం చేశాడంటే? సల్ఫేట్లు హెయిర్ సీరమ్‌లో సల్ఫేట్ ఉందో లేదో చెక్ చేసుకుని వాడండి. ఎందుకంటే దీనివల్ల జుట్టు రాలిపోయి చుండ్రు సమస్య పెరుగుతుంది. కాబట్టి మీరు వాడే సీరమ్‌లో సల్ఫేట్ లేకుండా చూసుకోండి. ఈ కెమికల్స్ ఉన్న హెయిర్ సీరమ్‌లు వాడటం వల్ల జుట్టు పలుచగా అయిపోతుంది. ఇది కూడా చూడండి: నేటి నుంచి దక్షిణాఫ్రికాతో T20 సిరీస్.. యువ ఆటగాళ్లు రాణిస్తారా? పారాబెన్స్ సీరమ్‌లో పారాబెన్‌లు ఉంటే అవి హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. దీనివల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. వీటికి బదులు తలకు నూనె అప్లై చేయడం మంచిది. ఆయిల్స్ వల్ల జుట్టు రాలిపోకుండా తొందరగా పెరుగుతుంది. ఇది కూడా చూడండి: టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం సిలికాన్ సీరమ్‌లో సిలికాన్ ఉంటే జుట్టు ఎక్కువ జిడ్డుగా ఉంటుంది. ఈ రసాయనం వల్ల జుట్టు పగుళ్లు రావడంతో పాటు పొడిగా మారుతుంది. కాబట్టి హెయిర్ సీరమ్ కొనుగోలు చేసే ముందు ఈ రసాయనాలు లేనివి కొనుగోలు చేయడం మంచిది. దీంతో మీ జుట్టు బలంగా ఉంటుంది. ఇది కూడా చూడండి: KCR: కేసీఆర్ సర్కార్ చేసిన తప్పులివే.. విద్యుత్ కమిషన్ సంచలన నివేదిక! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం #lifestyle #Hair-Serum #rtvlive #hair మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి