Weight Loss: ఈజీ వెయిట్ లాస్ విత్ హెల్తీ.. ఎలాగో మీకు తెలుసా?

ప్రతీ ఒక్కరి వంటింట్లో ఉండే దాల్చిన చెక్కతో ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే సిన్నమాల్డిహైడ్ అనే సమ్మేళనం జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే నెలసరి సమస్యలను కూడా తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు.

New Update
weight loss

weight loss

ప్రతీ ఒక్కరి వంటింట్లో దాల్చిన చెక్కలు తప్పనిసరిగా ఉంటాయి. వీటిని ఎక్కువగా బిర్యానీ కోసం వాడుతుంటారు. అయితే ఈ దాల్చిన చెక్కను వంటల రుచి పెంచడానికి మాత్రమే కాకుండా ఆరోగ్యంగా శరీర బరువు తగ్గేలా చేయడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందులో సిన్నమాల్డిహైడ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ఈజీగా బరువు తగ్గేలా చేస్తుంది.

ఇది కూడా చూడండి: Smartphone Offers: ఇదేక్కడి మాస్ రా మావా.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో 5జీ ఫోన్ ఇంత చీపా.. ఓ లుక్కేయండి బాసూ!

రక్తంలో చక్కెర స్థాయిలు 

అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. దాల్చిన చెక్క ఆకలిని కూడా అదుపులో ఉంచుతుందని నిపుణులు అంటున్నారు. ఒక నెల రోజుల పాటు దాల్చిన చెక్కను వాటర్, టీ ఇలా ఏదో విధంగా తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. గోరువెచ్చని నీటిలో దాల్చిన చెక్కను ఒక పది నిమిషాల పాటు మరిగించి తాగవచ్చు.

ఇది కూడా చూడండి:Radhika Yadav: పొట్టి బట్టలు వేసుకున్నందుకే హత్యా?.. రాధికా కేసులో ఫ్రెండ్ సంచలన విషయాలు

ఇలా తాగలేని వారు దాల్చిన చెక్క పౌడర్‌ను పాలు, ఓట్స్, తినే ఫుడ్‌లో వేసుకోవచ్చు. దీనివల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఏదో విధంగా దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. అయితే కొందరు నెలసరి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు దాల్చిన చెక్కను ఏదో విధంగా తీసుకోవడం వల్ల సక్రమంగా నెలసరి అవుతారని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చూడండి:Kota Srinivasa Rao: ఆ సూపర్ హిట్ పాట పాడింది 'కోట' నే.. ఈ విషయం మీకు తెలుసా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు