Heart Attack Children : ఈ రోజుల్లో పిల్లల్లో శారీరక శ్రమ ఉండటం లేదు. ఫాస్ట్ ఫుడ్ కల్చర్ పెరిగిపోయింది. దీంతోపాటు చదువుల ఒత్తిడి కూడా విపరీతంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు కూడా ఈ రోజుల్లో గుండెపోటు వస్తుంది. ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే పిల్లలకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. వారిలో గుండె జబ్బులు పెరుగుతుంటాయి. చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లే దీనికి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల ఒత్తిడిలు కూడా పిల్లల గుండెపై ప్రభావం చూపిస్తున్నాయి. ముందుగానే గుర్తించకపోతే వయసు పెరిగే కొద్దీ ప్రమాదం కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
Also Read : ఈ ఏడాది దీపావళి ఎప్పుడు? పండితులు చెబుతున్న డేట్ ఇదే!
చిన్న చిన్న విషయాలు నిర్లక్ష్యం:
కార్డియాలజిస్టుల అభిప్రాయం ప్రకారం ఈ రోజుల్లో పిల్లలు శారీరక శ్రమ చేయడం లేదు. అంతేకాకుండా ఫాస్ట్ ఫుడ్‌కి అలవాటు పడ్డారు. తల్లిదండ్రులు అజాగ్రత్తగా ఉంటే ఇది పిల్లలకు హాని కలిగించవచ్చు. అంతేకాకుండా పిల్లలు నడవడం, ఆడుకోవడం వంటివి చేయకపోవడం వల్ల కూడా రోగాల బారిన పడుతున్నారు. కొవ్వు పదార్థాలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. చాలామంది తల్లులు కూడా రోటి చేయడానికి బదులుగా అల్పాహారం రెండు నిమిషాల్లో తయారయ్యేలా చేస్తుంటారు. దీనివల్ల కూడా గుండెపోటు వస్తుంది. పిల్లల్లో గుండె జబ్బులు రావడానికి స్థూలకాయమే ప్రధాన కారణమని వైద్యులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: ఈ పండు చాలు జిమ్ అక్కర్లేదు.. సులభంగా బరువు తగ్గొచ్చు
పిల్లల్లో ఊబకాయం వల్ల శ్వాసకోశ సమస్యలు, మధుమేహం, ఇతర వ్యాధులు వస్తాయి. పిల్లలు గుండె జబ్బుతో బాధపడుతున్నట్లయితే ఎప్పటికప్పుడు వైద్యుల్ని సంప్రదించి సరైన మందులు తీసుకోవాలి. అసలు అశ్రద్ధ చేయకూడదు. చాలామంది తల్లిదండ్రులు చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది పిల్లలకు మంచిది కాదు. ఈ కాలంలో చాలామంది పిల్లలు మాదకద్రవ్యాలు బారిన పడుతున్నారు. దీంతో చదువుపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. దీని వల్ల కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.
Also Read : శ్రీలీలకు భారీ షాక్ ఇచ్చిన పూజా హెగ్డే?
తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు:
పిల్లలను ఒత్తిడికి గురికానివ్వద్దు, ఆహారంపై శ్రద్ధ వహించాలి. ఫాస్ట్ ఫుడ్ మానేయాలి. పిల్లలతో వ్యాయామం చేయించాలి. అలాగే చిన్నవయసులోనే మధుమేహం, బీపీపి బారిన పడకుండా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించాలి. పిల్లవాడు లావుగా ఉంటే కొవ్వును కరిగించడానికి వ్యాయామాలు చేయించాలి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఈ విటమిన్ లోపంతో కీళ్ల నొప్పులు వస్తాయి