Lose Weight: ఈ పండు చాలు జిమ్‌ అక్కర్లేదు.. సులభంగా బరువు తగ్గొచ్చు

బరువు తగ్గాలనుకుంటే బొప్పాయి జ్యూస్ తాగితే ప్రయోజనకరంగా ఉంటుంది. బొప్పాయిని ముక్కలుగా కట్ చేసి దానికి బ్లాక్ సాల్ట్, ఎండుమిర్చి యాడ్ చేసి అల్పాహారంగా తీసుకోవచ్చు. దీంతో కడుపు నిండినట్టు, ఆకలి ఎక్కువగా కాదు. దీనివల్ల బరువు తగ్గుతారు.

New Update
lose weight 1

Weight Lose

Papaya Juice: ఈ రోజుల్లో సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా చాలామంది బరువు పెరుగుతుంటారు. ఇది ఒక సమస్యగా మారింది. బరువు తగ్గడానికి జిమ్‌లో చేరడం, డైటింగ్ చేయడం, అనేక రకాల వ్యాయామాలు చేస్తుంటారు. అయినా బరువు మాత్రం తగ్గరు. ఇలాంటి పరిస్థితుల్లో బొప్పాయి చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. బరువు తగ్గేందుకు కూడా బాగా ఉపయోగపడుతుంది. బొప్పాయిలో చాలా పోషకాలు ఉన్నాయి. ఇవి బరువును నియంత్రించడంలో సహాయపడతాయి. 

Also Read :  పిల్లల్లో కూడా గుండెపోటు రావడానికి కారణం ఇదే

కొవ్వును తగ్గించి..ఫిట్‌నెస్‌:

అధిక ఫైబర్ కంటెంట్, తక్కువ క్యాలరీలను ఈ పండు కలిగి ఉంటుంది. దీనివల్ల కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆహారంలో నాలుగు రకాలుగా ఈ పండును చేర్చుకోవచ్చు. బరువు తగ్గాలనుకుంటే బొప్పాయి జ్యూస్ తాగితే ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల ఎన్నో పోషకాలు మనకు అందుతాయి. శరీరంలో కొవ్వును తగ్గించి, ఫిట్‌నెస్‌ కూడా మెరుగుపరుస్తుంది. బొప్పాయి వల్ల జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. బొప్పాయిని ముక్కలుగా కట్ చేసి దానికి బ్లాక్ సాల్ట్, ఎండుమిర్చి యాడ్ చేసి అల్పాహారంగా తీసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: వైద్యులు తెల్లకోటు ఎందుకు వేసుకుంటారో తెలుసా?

అంతేకాకుండా బొప్పాయిని పాలతో కలిపి తినడం కూడా ఎంతో ఆరోగ్యకరం. మిక్సీలో గ్లాసు పాలను పోసి అందులో బొప్పాయి ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్, గింజలను కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంతో కడుపు నిండినట్టు అనిపిస్తుంది. ఆకలి కూడా ఎక్కువగా కాదు. దీనివల్ల బరువు తగ్గుతారు. బొప్పాయిని పెరుగుతో కలిపి కూడా తినవచ్చు. ఇది రుచిగా ఉంటుంది. అంతేకాకుండా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. బొప్పాయి, డ్రైఫ్రూట్స్ కలిపి ఓ గిన్నె పెరుగు వేసుకొని తినడం వల్ల శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. బరువు కూడా వేగంగా తగ్గుతారు.

Also Read :  బ్రేకప్‌తో బాధపడుతున్నారా.. బయటపడటం ఎలాగంటే?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: బ్యాట్‌ విరగ్గొట్టిన కోహ్లీ.. ఎందుకంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు