/rtv/media/media_files/2025/08/17/bhadrapad-amavasya-2025-2025-08-17-09-28-56.jpg)
Bhadrapad Amavasya 2025
హిందూ సంప్రదాయంలో.. పితృదేవతలకు తర్పణం ఒక ముఖ్యమైన ఆచారం. ఇది మరణించిన మన పూర్వీకులకు మనం అర్పించే నివాళి. తర్పణం అంటే తృప్తిపరచడం అని అర్థం. తమ పూర్వీకుల ఆత్మలకు శాంతి కలగాలని కోరుతూ, నీరు, నువ్వులు, బియ్యం వంటి వాటితో ఈ కర్మ నిర్వహిస్తారు. ఈ తర్పణం పితృ పక్షం, అమావాస్య, సంక్రాంతి వంటి ప్రత్యేక సమయాల్లో చేస్తారు. ఈ ఆచారం ద్వారా పితృదేవతలు సంతృప్తి చెంది... మనకు, మన కుటుంబానికి ఆశీస్సులు అందిస్తారని నమ్ముతారు. ఇది తరతరాల మధ్య ఉన్న బంధాన్ని, ప్రేమను, గౌరవాన్ని ప్రతిబింబించే ఒక పవిత్రమైన కర్మ. భాద్రపద అమావాస్య గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
పుణ్యం రెట్టింపు..
భాద్రపద అమావాస్య ఈ ఏడాది అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. పితృదేవతలకు తర్పణాలు, దాన ధర్మాలు చేయడానికి ఈ రోజు చాలా పవిత్రమైనది. అయితే.. ఈ సంవత్సరం అమావాస్య తేదీపై కొంత సందిగ్ధత నెలకొంది. భాద్రపద అమావాస్య ఆగస్టు 22, 2025న ఉదయం 11:55 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు ఆగస్టు 23, 2025న ఉదయం 11:35 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయ తిథి ప్రకారం.. ఈ పవిత్ర దినం ఆగస్టు 23, 2025న పాటించబడుతుంది. ఈ రోజు శనివారం కావడంతో దీనిని శనిశ్చరి అమావాస్య అని పిలుస్తారు. శనివారం అమావాస్య రావడం వల్ల పుణ్యకార్యాలు, దానధర్మాలు చేయడం వల్ల లభించే పుణ్యం రెట్టింపు అవుతుందని పండితులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: నిరాశ, ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారా..? అయితే.. ఈ 3 యోగాసనాలు మీకోసమే!
పితృదేవతలను స్మరించుకునేందుకు.. వారి ఆత్మశాంతి కోసం ఈ రోజు పలు ఆచారాలు పాటిస్తారు. సూర్యోదయానికి ముందే పవిత్ర నదులు, చెరువులు లేదా కుండాలలో స్నానం చేయడం, సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం శ్రేయస్కరం. అనంతరం నల్ల నువ్వులను నీటిలో వదలడం సంప్రదాయం. పితృదేవతలను స్మరించుకుంటూ సాయంత్రం వేళ రావిచెట్టు కింద నువ్వుల నూనె దీపం వెలిగించి, ఏడు ప్రదక్షిణలు చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. నది ఒడ్డున పితృదేవతలకు పిండ ప్రదానం చేసి పేదలకు లేదా బ్రాహ్మణులకు దానాలు చేయడం ఈ రోజు ప్రత్యేకత. అలాగే ఈ రోజు కాలసర్ప దోష నివారణకు పూజలు చేయవచ్చు. శనివారం అమావాస్య కాబట్టి శనిదేవుడిని పూజించడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి. ఈ విధంగా భాద్రపద అమావాస్య ఆధ్యాత్మికంగా, ఆచారాల పరంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: వర్షాకాలంలో ఈ నూనె చర్మానికి మిత్రువా..? శత్రువా..?.. నిపుణులు చెప్పిన కొత్త విషయాలు మీకోసం!!