Hurry: ఉరుకులు పరుగుల జీవితంలో ప్రశాంతంగా కూర్చొని భోజనం చేసే తీరిక సైతం ప్రజలకు ఉండటం లేదు. పని హడావిడిలో స్పీడ్‌గా తినేసి వెళ్తుంటారు. ఉదయం త్వరగా ఆఫీసుకు చేరుకోవాలి, మధ్యాహ్నం ఆఫీసులో త్వరగా భోజనం చేయాలనే హడావుడి, రాత్రి అలసిపోయి మంచంపై కూర్చుని నిద్రపోవడం అలవాటు. అలాంటి అలవాటు ఉంటే అనేక సమస్యలు వస్తాయంటున్నారు వైద్యులు.
Also Read : ఈ వ్యాధులు ఉన్నవారు నెయ్యి ముట్టుకోవద్దు
గ్యాస్, ఉబ్బరం:
- చాలా త్వరగా పెద్ద ముక్కలుగా తినడం వల్ల కడుపులోకి గాలి, ఆహారాన్ని ఒకేసారి వెళ్తాయి. ఇది గ్యాస్, ఉబ్బరం సమస్యలకు దారితీస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి మీకు త్వరగా తినే అలవాటు ఉంటే వెంటనే దానిని మానుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
వేగంగా బరువు పెరగడం
- సైన్స్ ప్రకారం మనం ఆహారం తిన్నప్పుడు, తిన్న 20 నిమిషాల్లోనే కడుపు నిండుదనానికి సంకేతం ఇస్తుంది. తొందరగా ఆహారం తీసుకుంటే కడుపు 20 నిమిషాల ముందే సిగ్నల్ ఇవ్వడం ప్రారంభిస్తుంది. దీని కారణంగా అధిక బరువు, ఊబకాయం, వేగంగా బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి.
టైప్ 2 డయాబెటిస్
- వేగంగా ఆహారం తీసుకోవడం వల్ల టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది.
Also Read : రాంగ్ టైమ్‌లో టీ తాగితే కలిగే నష్టాలు ఇవే!
జీవక్రియ ఆటంకాలు
- ప్రతిరోజూ వేగంగా తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. ఊబకాయంతో జీవక్రియ కూడా క్షీణిస్తుంది. ఇది నేరుగా గుండెపై ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఈ ఐదు పనులు చేస్తే జీవితాంతం గుండెపోటు రాదు
ఇది కూడా చదవండి: చలి కారణంగానే జలుబు వస్తుందా?.. ఈ విటమిన్ లోపం కారణమా?