Skin Health: తెల్లని ఈ పదార్థంతో స్నానం చేస్తే.. అందానికి బ్రాండ్ అంబాసిడర్‌ ఇక మీరే!

పాలతో స్నానం చేయడం వల్ల చర్మం మెరుస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని లాక్టిక్ ఆమ్లం నల్లగా ఉన్న చర్మాన్ని తెల్లగా మారేలా చేస్తుంది. అయితే చర్మ సమస్యలు ఉన్నవారు పాలతో స్నానం చేయడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

New Update
Milk Bath

Milk Bath

అందంగా ఉండాలంటే బ్యూటీ ప్రొడక్ట్స్ మాత్రమే కాదు సహజ చిట్కాలు కూడా అప్పుడప్పుడు పాటిస్తుండాలి. అయితే ఆరోగ్యానికి మేలు చేసే పాలతో అందాన్ని కూడా పెంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. పాలలో లాక్టిక్ ఆమ్లం, ప్రోటీన్, కొవ్వు, విటమిన్లు ఏ, డీ, ఈ వంటివి ఉంటాయి. ఇవి చర్మాన్ని ఎక్స్‌ఫోలియన్ చేసి స్కిన్ మృదువుగా ఉండేలా చేస్తాయి. పాలలో ఉండే కొవ్వులు చర్మాన్ని తేమగా ఉంచుతాయి.

ఇది కూడా చూడండి:Vivo X200 FE vs Oppo Reno 14 Pro 5G: చించేశాయ్ భయ్యా.. వివో, ఒప్పో కొత్త ఫోన్లు మైండ్ బ్లోయింగ్!

పొడి చర్మం బారి నుంచి..

వాటర్‌తో కాకుండా పాలతో స్నానం చేయడం వల్ల చర్మంపై ఉండే బ్యాక్టీరియా, చెమట, మురికి అంతా కూడా తొలగిపోతుంది. పాలలోని పోషకాలు చర్మం పొడి బారకుండా ఉండేలా చేస్తాయి. ఎంత నల్లగా ఉన్నవారు అయినా కూడా పాలతో స్నానం చేయడం వల్ల అందంగా మారుతారని నిపుణులు చెబుతున్నారు. పాలతో స్నానం చేయడం కుదరని వారు పాల మీగడను ముఖానికి అప్లై చేసినా కూడా తెల్లగా మారుతారు. ఎంతటి నల్లగా ఉన్నవారు అయినా కూడా వారం రోజుల్లో తెల్లగా మారుతారని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి:  Telangana Crime : పెద్దపల్లి జిల్లాలో దారుణం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన పంచాయతీ

పాలలో పోషకాలు ఉండటం వల్ల ఇవి చర్మానికి మేలే చేస్తాయి. కానీ చర్మ సమస్యలు ఉన్నవారికి మాత్రం అసలు మంచిది కాదు. ఇందులో ఉండే లాక్టోస్ అలెర్జీ సమస్యలను ఇంకా పెంచుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే పాలలోని కొవ్వు కాస్త జిగటగా అనిపిస్తుంది. దీనివల్ల కొందరికి చర్మంపై మొటిమలు, మచ్చలను కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ సమస్యలు ఉన్నవారు పాలతో స్నానం చేసేముందు వైద్యుల సూచనలు తీసుకోవాలి. 

ఇది కూడా చూడండి: Nimisha Priya: సంచలన అప్‌డేట్.. నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు