Balapur Ganesh Laddu: బాలాపూర్ లడ్డూను ఎక్కడ, ఎలా తయారు చేస్తారో తెలుసా?

హైదరాబాద్‌లో నిమజ్జన ఉత్సవాల్లో అందరి చూపు బాలాపూర్ లడ్డూపై ఉంది. లక్షలు పలికే ఈ ఫేమస్ బాలాపూర్ లడ్డూ చాలా ప్రత్యేకమైనది. 21 కిలోలతో ప్రతీ ఏడాది హనీ ఫుడ్స్ వారు ఈ లడ్డూను బాలాపూర్‌లోనే తయారు చేస్తున్నారు.

New Update
Balapur laddu

Balapur laddu

హైదరాబాద్‌లో నిమజ్జన ఉత్సవాల్లో అందరి చూపు బాలాపూర్ లడ్డూపై ఉంది. లక్షలు పలికే ఈ ఫేమస్ బాలాపూర్ లడ్డూ చాలా ప్రత్యేకమైనది. ఎన్నో ఏళ్ల నుంచి ఒక సంప్రదాయంగా ఈ బాలాపూర్ లడ్డూని తయారు చేస్తున్నారు. ప్రతీ ఏడాది వేలం పాట ద్వారా ఈ లడ్డూ ప్రసిద్ధి చెందింది. అయితే ఈ బాలాపూర్ లడ్డూను ఎవరు? ఎక్కడ తయారు చేస్తారు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. 

బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ వారు ఎంతో ప్రత్యేకంగా తయారు చేయిస్తారు. సాధారణ లడ్డూలానే దీన్ని తయారు చేస్తారు. కాకపోతే కాస్త భిన్నంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ బాలాపూర్ లడ్డూను హనీ ఫుడ్స్ వారు తయారు చేస్తున్నారు. గతంలో ఈ లడ్డూను తయారు చేసిన కుటుంబ వంశస్తులు తయారు చేస్తారు. 1994 నుంచి ఇప్పటి వరకు ప్రతీ ఏడాది లడ్డూను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. ఈ లడ్డూ తయారీలో శనగపిండి, కలకండ, ఆవు నెయ్యి, యాలకులు, డ్రైఫూట్స్ వంటివి ఉపయోగిస్తారు. లడ్డూ తయారీలో పంచదారకు బదులు కలకండను ఉపయోగిస్తారు. దీనివల్ల లడ్డూ ప్రత్యేకమైన రుచి ఉండటంతో మెరుస్తుందట. వినాయక చవితికి ఒక రోజు ముందు ఈ లడ్డూను తయారు చేస్తారు.

ఎలా తయారు చేస్తారంటే?

ఈ బాలాపూర్ లడ్డూను తయారు చేసే ముందు శనగపప్పును ఎండపెట్టి దంచి పిండి తయారు చేస్తారు. ఇందులో నీరు కాకుండా పాలు వేసి తయారు చేస్తారని వారు తెలిపారు. ఆవు నెయ్యితో ఉపయోగించి ఈ లడ్డూను తయారు చేస్తారు. దీనివల్ల పిండిలో ఉన్న పచ్చి వాసన పోయి లడ్డూకు మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత మరో పాత్రలో కలకండ పానకం తయారు చేస్తారు. సరైన పాకంలో ఉండేలా చూసుకుంటారు. ఇందులో డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, వేయించిన శనగపిండిని కలిపి బాగా మిశ్రమం చేస్తారు. ఈ మిశ్రమం తయారీలో ఎంత నెయ్యి వాడారనే దాటి బట్టి లడ్డూకి రుచి వస్తుంది. మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత, చేతితో లడ్డూలను ఉండలుగా చుడతారు. దీన్ని వెండి లేదా ఇత్తడి ప్లేట్‌లో ఉంచి దేవుడి దగ్గరకు తీసుకెళ్తారు. అయితే ఈ లడ్డూను కేవలం 21 కేజీలతో మాత్రమే తయారు చేస్తారు. అయితే ఇలా చేయడానికి కూడా ఓ కారణం ఉంది. 21 అనే సంఖ్యను చాలా శుభకరమైనదిగా భావిస్తారు. ఇది ప్రధానంగా సంపద, విజయం, అదృష్టానికి సూచికగా పరిగణిస్తారు. ఈ రెండు అంకెలను కలిపితే మూడు వస్తుంది. సంఖ్యా శాస్త్రంలో 3వ అంకె గురువు (బృహస్పతి) గ్రహాన్ని సూచిస్తుంది. ఇది జ్ఞానం, సంపద, శ్రేయస్సుకు కారకంగా భావిస్తారు. దీనివల్ల శుభ ఫలితాలు ఉంటాయని నమ్ముతారు. అందుకే లడ్డూ తయారీలో 21 కేజీలు ఉపయోగించడం ఆనవాయితీగా వస్తోంది.

బాలాపూర్ లడ్డూ ప్రత్యేకతలు

ఈ లడ్డూను వేలంలో గెలుచుకున్నవారికి అదృష్టం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు లభిస్తాయని భక్తులు బలంగా విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం బాలాపూర్ లడ్డూను వేలం వేస్తారు. ఈ వేలం పాటలో వచ్చిన డబ్బును గ్రామ అభివృద్ధి కార్యక్రమాలకు, దేవాలయాల నిర్వహణకు ఉపయోగిస్తారు. లడ్డూను వేలంలో గెలుచుకున్న వ్యక్తికి సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. ఇది వారి దాతృత్వాన్ని, భక్తిని చాటుకోవడానికి ఒక మార్గంగా భావిస్తారు. లడ్డూలో వాడే స్వచ్ఛమైన ఆవు నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వంటి పదార్థాల వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని నమ్ముతారు.

Advertisment
తాజా కథనాలు