/rtv/media/media_files/2025/09/05/pitru-paksha-2025-09-05-17-54-17.jpg)
Pitru Paksha
కొత్త వాహనం కొనుగోలు అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. మీ కలల కారు లేదా బైక్ కొనడానికి సరైన సమయం కోసం చూస్తున్నారా..? ఈ శుభ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చడానికి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని శుభ ముహూర్తాలు సూచించబడ్డాయి. ఈ ముహూర్తాలు కొత్త వాహనాన్ని ఇంటికి తీసుకురావడానికి లేదా బుక్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. మంచి తిథి, నక్షత్రం, వారం కలయికతో ఏర్పడిన ఈ శుభ ముహూర్తాలు మీ ప్రయాణాలను సురక్షితంగా, అదృష్టవంతంగా మారుస్తాయని నమ్ముతారు. కాబట్టి మీ కొత్త వాహనాన్ని బుక్ చేసుకునే ముందు.. ఈ శుభ ముహూర్తాలను పరిశీలించడం చాలా ముఖ్యమని పండితులు చెబుతున్నారు. పితృ పక్షం తర్వాత కూడా వాహనాలు కొనడానికి మంచి సమయం గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
పితృపక్షానికి ముందు వాహనాల బుకింగ్ కోసం శుభ ముహూర్తం..
కారు కొనడం అనేది చాలామంది కల. హిందూ సంప్రదాయంలో ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు శుభ ముహూర్తం చూసినట్లే.. కొత్త వాహనం కొనేటప్పుడు లేదా బుక్ చేసేటప్పుడు కూడా శుభ సమయం చూస్తారు. ఈ సమయంలో వాహనం కొంటే విజయం వరిస్తుందని నమ్ముతారు. ఈ సారి పితృ పక్షం సెప్టెంబర్ 7న ప్రారంభమవుతుంది. ఈ 16 రోజులు వాహనాలు, ఇతర శుభ వస్తువులను కొనడం అశుభకరంగా పరిగణిస్తారు. అందుకే.. పితృ పక్షం ప్రారంభానికి ముందే వాహనం బుక్ చేసుకోవాలనుకునే వారికి సెప్టెంబర్ 5, 2025 ఒక మంచి రోజు. ఆ రోజున శుక్రవారం.. లక్ష్మీదేవికి పవిత్రమైన రోజు, ఓనం, శుక్ర ప్రదోష వ్రతం కూడా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: ఆదివారం నాడు చంద్రగ్రహణం.. ఈ 5 రాశుల వారికి డేంజర్!
పితృ పక్షం తర్వాత కూడా వాహనాలు కొనడానికి మంచి సమయం సెప్టెంబర్ 5, 2025 ఉదయం 6:01 నుంచి సెప్టెంబర్ 6, 2025 ఉదయం 3:12 వరకు వాహనాలు బుక్ చేసుకోవడం మంచిది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సోమ, బుధ, గురు, శుక్రవారంతోపాటు ఆదివారం వాహనాలు కొనడానికి శుభ దినాలు. రాహుకాలంలో, అమావాస్య రోజున వాహనాలు కొనడం లేదా అమ్మడం మానుకోవాలి. ఎందుకంటే అవి అశుభకరంగా పరిగణిస్తారు. వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఇది మీకు మంచి ఫలితాలు అందిస్తుందని పండితులు చెబుతున్నారు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి:చింత, రావితోపాటు రాత్రి పూట ఈ 4 చెట్ల దగ్గరికి అస్సలు వెళ్లొద్దు.. ఎందుకో తెలుసా..?