Ashada Amavasya: అరుదైన ఆషాఢ అమావాస్య.. ఇలా చేస్తే అష్ట ఐశ్వర్యాలు మీ సొంతం

హిందువులకు ఎంతో ముఖ్యమైన ఆషాడ అమావాస్య నాడు వేప చెట్టును నాటడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుందని పండితులు అంటున్నారు. అలాగే బ్రహ్మముహుర్తంలో నిద్రలేచి తులసి మొక్కకు పూజలు నిర్వహించితే మంచిదని చెబుతున్నారు.

New Update
Ashadha Amavasya

Ashadha Amavasya

హిందూ సంప్రదాయంలో ఆషాఢ అమావాస్య చాలా ప్రత్యేకమైనది. ఈ ఆషాడ అమావాస్య నాడు కొన్ని పనులు చేస్తే మాత్రం తప్పకుండా అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. జూన్ 24వ తేదీన సాయంత్రం 7 గంటల 02 నిమిషాలకు ప్రారంభమై జూన్ 25వ తేదీన సాయంత్రం 4 గంటల 04 నిమిషాలకు పూర్తి అవుతుంది. ఈ ఆషాడ అమావాస్య నాడు తర్పణం, దానధర్మాలు వంటివి చేయడం చాలా మంచిది పండితులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Jeedimetla Murder: జీడిమెట్ల తల్లి హత్య కేసులో షాకింగ్ నిజాలు.. నిందితురాలు చెల్లి ఏం చెప్పిందంటే?

ఈ చెట్టును నాటడం వల్ల..

ఈ ఆషాఢ అమావాస్య నాడు వేప మొక్కను నాటడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే ఇప్పటి వరకు ఉన్న సమస్యలు తొలగి, అన్ని విధాలుగా  హ్యాపినెస్ ఉంటుంది. కొందరు అప్పులు సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు వేప మొక్కను నాటడం వల్ల అప్పుల సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. వేప చెట్టుతో పాటు రావి చెట్టును పూజించడం, పితృవులకు పిండం పెట్టడం వల్ల కూడా సమస్యలు తొలగిపోతాయి.

ఇది కూడా చూడండి: Bike Stunts: HYDలో ఒకే బైక్‌పై 8 మంది యువకుల స్టంట్.. పోలీసులకు దొరకడంతో.. (వీడియో)

ప్రతీ అమావాస్యకు తప్పకుండా పూర్వీకులకు పిండం పెట్టాలి. దీనివల్ల ఇంట్లో ఎలాంటి సమస్యలు రావని పండితులు అంటున్నారు. అయితే ఈ ఆషాఢ అమావాస్య నాడు తప్పకుండా బ్రహ్మ ముహుర్తంలో లేచి ఇంట్లో పూజలు నిర్వహించాలి. అలాగే తులసి మొక్కకి ఎర్రని కండువా పెట్టి పూజించడం వల్ల ఇంకా మంచిది. అలాగే తులసి మొక్కకు పూజలు చేయడం వల్ల ఇంట్లో, వ్యక్తిగత అన్ని సమస్యలు కూడా తీరిపోయి, అష్ట ఐశ్వర్యాలు సొంతం అవుతాయని పండితులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: Mosquito Drone: అమెరికాకు ఇక చుక్కలే.. దోమ సైజులో చైనా డ్రోన్.. వీడియో చూస్తే షాక్ అవుతారు!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

ఇది కూడా చూడండి:  Vivo T4 Ultra Offers: వివో మామ ఇచ్చిపడేశాడు భయ్యా.. T4 Ultra మొబైల్‌పై భారీ డిస్కౌంట్లు - కెమెరా హైలైట్!

Advertisment
Advertisment
తాజా కథనాలు