/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Lenovo-jpg.webp)
Lenovo : అతితక్కువ ధరల్లో ల్యాప్‌టాప్(Laptop) కొనాలనుకునేవారి కోసం ప్రముఖ టెక్ ఉత్పత్తుల లెనోవో బంఫర్ ఆఫర్(Bumper Offer) ను ప్రకటించింది. ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 మోడల్(Idea Pad Slim 3 Model) పై ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. దీని అసలు ధర రూ.30,790. కానీ ప్రస్తుతం ఏకంగా 41 శాతం తగ్గింపుతో ఫ్లిప్‌కార్టులో కేవలం రూ.17,990కే లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.
Also Read: తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ, అమిత్ షా
మోడల్ నంబర్ - 14M868
క్యారీ ఇన్ వారంటీ - ఒక సంవత్సరం
ర్యామ్ - 8 GB
స్టోరేజ్ మెమరీ - 128 GB
బరువు - 1.3 కిలోగ్రాములు
డిస్ప్లే- 14.00 అంగుళాల(1366 x 768 పిక్సెల్) HD డిస్‌ప్లే
ఈ సేల్ ప్యాకేజీలో ల్యాప్‌టాప్‌తో పాటు AC అడాప్టర్, యూజర్ మ్యానువల్‌ను అందిస్తారు. అంతేకాదు MediaTek ఇంటిగ్రేటెడ్ ARM G52 2EE MC2 గ్రాఫిక్ ప్రాసెసర్, Chrome ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. కానీ దీనిలో డిస్క్ డ్రైవ్ మాత్రం అందుబాటులో లేదు. ఈ ల్యాప్‌టాప్ 10 గంటల వరకు దీర్ఘకాలంగా ఉండే బ్యాటరీ లైఫ్‌తో తరచుగా ప్లగ్ ఇన్ చేయకుండా.. ఉత్పాదకంగా పని చేసేందుకు మీకు పర్మిషన్ ఇస్తుంది.
Also Read: నిర్మల్ జిల్లాలోని ఆ గ్రామాల్లో చిరుత భయం.. వణికిపోతున్న రైతులు