MI VS GT: మళ్ళీ హిట్ మ్యాన్ సింగిల్ డిజిట్ కే అవుట్
హిట్ మ్యాన్ మళ్ళీ వరుసగా ఫెయిల్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ లలో సింగిల్ డిజిట్లకే అవుట్ అయి పెవిలియన్ బాట పట్టాడు. ఈరోజు కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు.
హిట్ మ్యాన్ మళ్ళీ వరుసగా ఫెయిల్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ లలో సింగిల్ డిజిట్లకే అవుట్ అయి పెవిలియన్ బాట పట్టాడు. ఈరోజు కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు.
BSNL చౌకైన రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. రూ.1198లతో రీఛార్జ్ చేసుకుంటే 356 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ప్రతి నెలా 300 నిమిషాల కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. ఎంపిక చేసిన ప్రదేశాలలో మాత్రమే కాల్స్ అవుతాయి. ఈ ప్లాన్‌లో నెలకు 3GB డేటా సౌకర్యాన్ని అందిస్తుంది.
ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ పాఠశాలలోని ఓ లేడీ టీచర్, అంగన్వాడీ వర్కర్ తీవ్రంగా కొట్టుకున్నారు. కిందపడి జుట్లు పట్టుకుని తన్నుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఉగాది పండుగపూట సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ షాకిచ్చింది. రేపు, ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు శనివారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టీమ్ 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. సాయి సుదర్శన్(63), శుభ్‌మన్ గిల్(38), జోస్ బట్లర్ (39) పరుగులతో రాణించారు.
Nubia Neo 3 సిరీస్‌లో రెండు స్మార్ట్ఫోన్లు రిలీజ్ అయ్యాయి. అందులో Neo 3 5G- 8/128GB ధర రూ.12,000గా, 8/256జీబీ ధర రూ.15000గా ఉంది. Nubia Neo 3 GT ఫోన్ 12/256జీబీ ధర రూ.19000గా ఉంది. వీటిని LAZADAలో ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.
మయన్మార్, థాయ్‌లాండ్‌లో వచ్చిన భూకంపాలు పెను విధ్వంసం సృష్టించింది. ఇప్పటిదాకా మయన్మార్‌లో సంభవించిన భూకంపం ధాటికి 1644 మంది మృతి చెందినట్లు అక్కడి సైనిక ప్రభుత్వం వెల్లడించింది. మరో 2400 మంది గాయపడినట్లు పేర్కొంది.
తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. తిరుపతి లోని జీవకోన ప్రాంతంలో నివసిస్తున్న రాజేష్ కుటుంబ సభ్యులను కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ క్రమంలో రూ.కోటి ఇవ్వాలని వారిని బెదిరించారు. వారిలో ఒకరు దుండగుల నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించారు.
బరువు తగ్గాలని చూస్తున్న వారు అప్పుడే చేసిన రోటీల కంటే చల్లబడిన రోటీలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. ఇందులో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనివల్ల మధుమేహం, జీర్ణక్రియ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.