Kidnap in Tirupati: తిరుపతిలో దారుణం...ఒకే కుటుంబంలోని ఐదుగురు కిడ్నాప్...

తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. తిరుపతి లోని జీవకోన ప్రాంతంలో నివసిస్తున్న రాజేష్ కుటుంబ సభ్యులను కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ క్రమంలో రూ.కోటి ఇవ్వాలని వారిని బెదిరించారు. వారిలో ఒకరు దుండగుల నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించారు.

New Update
Kidnapping in Tirupati

Kidnapping in Tirupati

Kidnap in Tirupati: తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. తిరుపతి లోని జీవకోన ప్రాంతంలో నివసిస్తున్న రాజేష్ కుటుంబ సభ్యులను కొంతమంది దుండగులు నిన్న(శుక్రవారం) కిడ్నాప్ చేశారు. ఈ క్రమంలో రూ.కోటి ఇవ్వాలని వారిని బెదిరించారు. అయితే.. కుటుంబ సభ్యుల్లోని ఒకరు చిత్తూరులో ఉన్న తమ బంధువుల దగ్గరికి వెళితే ఇస్తామని చెప్పడంతో.వారిని దుండగులు తీసుకెళ్తుండగా ఐతేపల్లి వద్ద కారులో నుంచి రాజేష్ దూకేశాడు.

Also Read: షేక్ హసీనాకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన సీఐడీ
 
అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలతో కొట్టుమిట్టాడుతున్న రాజేష్‌ను స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు రాజేష్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్ తన భార్య, పిల్లలను కాపాడాలని పోలీసులను వేడుకున్నారు. ఈ తరుణంలో అతని కుటుంబ సభ్యుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: కోలకత్తా జూ.డాక్టర్ పై సామూహిక అత్యాచారం జరగలేదు..సీబీఐ

Also Read: పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 8 మంది పాక్ ఆర్మీ సైనికులు మృతి

రాజేష్ పై పగబట్టిన భార్గవ్

తిరుపతి జీవకోనకు చెందిన రాజేష్ తన స్నేహితుడు భార్గవ్ కి గతంలో షూరిటీ గా ఉండి  డబ్బులు ఇచ్చినట్లు తెలిసింది.  తన పరిస్థితి బాగాలేదని తిరిగి డబ్బులు ఇవ్వాలంటూ కోరిన రాజేష్ పై పగబట్టిన భార్గవ్. చెల్లించాల్సిన సొమ్ము కాస్త పక్కన పెట్టి రెండు కోట్లు ఇస్తే నీ కుటుంబాన్ని వదులుతా లేకుంటే చంపేస్తానంటూ బెదిరించి కిడ్నాప్ చేసిన భార్గవ్. కిడ్నాపర్ల వలలో నుంచి ప్రాణాలతో బయటపడ్డ రాజేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇది కూడా చూడండి: Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

Also Read: మరో మయన్మార్‌ కానున్న భారత్.. త్వరలో ఇండియాలో విధ్వంసం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు