Cheapest Recharge Plan: వారెవ్వా చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్- 365 రోజుల వ్యాలిడిటీ.. కానీ!

BSNL చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ ప్రకటించింది. రూ.1198లతో రీఛార్జ్ చేసుకుంటే 356 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ప్రతి నెలా 300 నిమిషాల కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. ఎంపిక చేసిన ప్రదేశాలలో మాత్రమే కాల్స్ అవుతాయి. ఈ ప్లాన్‌లో నెలకు 3GB డేటా సౌకర్యాన్ని అందిస్తుంది.

New Update
bsnl cheapest recharge plan announced

bsnl cheapest recharge plan announced

గతేడాది ప్రముఖ అగ్ర టెలికం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచేశాయి. అదే సమయంలో ప్రభుత్వరంగ టెలికం సంస్థ బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ అందించింది. ఇందులో భాగంగానే మిగతా నెట్‌వర్క్ సంస్థలకు గట్టి దెబ్బ కొట్టింది. 

Also Read: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!

తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్‌లను అందించి లక్షల మంది యూజర్లను తనవైపుకు తిప్పుకుంది. వరుస పెట్టి ఆఫర్లు ప్రకటించి అదరగొట్టేస్తుంది. ఇది మిగతా నెట్‌వర్క్‌లకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే తక్కువ ధరలో పలు రీఛార్జ్‌ ప్లాన్‌లను అందించింది. తాజాగా మరో చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను అనౌన్స్ చేసింది. 

Also Read: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

365 రోజుల వ్యాలిడిటీ

BSNL తాజాగా రూ.1198 ధరతో రీఛార్జ్ ప్లాన్ అందించింది. ఇది 1 సంవత్సరం వ్యాలిడిటీతో వస్తుంది. అంటే దాదాపు 365 రోజుల పాటు ఫ్రీగా బెనిఫిట్స్ పొందొచ్చు. దీని వల్ల 12 నెలల పాటు రీఛార్జ్ చేయడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఈ ప్లాన్‌లో వినియోగదారుడు ప్రతి నెలా 300 నిమిషాల కాలింగ్ సౌకర్యం పొందుతాడు. ఈ ప్లాన్‌లో కొన్ని నిబంధనలు, షరతులు ఉన్నాయి. భారతదేశంలోని ఎంపిక చేసిన ప్రదేశాలలో మాత్రమే ఇన్‌కమింగ్ కాల్‌లు, అవుట్‌గోయింగ్ కాల్‌ల ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. 

Also Read: అమెరికాలోని విదేశీ విద్యార్థులకు షాక్.. బహిష్కరిస్తున్నమంటూ మెయిల్స్!

ఇంకా ఈ ప్లాన్‌లో BSNL తన వినియోగదారులకు నెలకు 3GB డేటా సౌకర్యాన్ని అందిస్తుంది. ఇది కాకుండా SMS ప్రయోజనం కూడా పొందుతారు. నెలకు 30 ఉచిత SMS సౌకర్యం అందుబాటులో ఉంది.

BSNL 5G నెట్‌వర్క్ సేవలు

Airtel, Reliance Jio భారతదేశంలోని అనేక ప్రాంతాలలో 5G నెట్‌వర్క్ సేవలను ప్రవేశపెట్టారు. Vi కూడా 5G సేవల ప్రయోజనాన్ని అందిస్తోంది. కానీ BSNL ఈ విషయంలో వెనుకబడి ఉంది. త్వరలో భారతదేశంలో BSNL 5G సేవలను ప్రవేశపెడుతుందని పలువురు భావిస్తున్నారు. జూన్ 2025 నాటికి ఢిల్లీ సహా ఇతర నగరాల్లో 5G సేవను ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం 4G నెట్‌వర్క్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

Also Read: మయన్మార్ లో పెరుగుతున్న మృతుల సంఖ్య..భారత్ 15 టన్నుల సహాయ సామాగ్రి

(BSNL Bumper Offer | bsnl offers | BSNL New Recharge Plan | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు