/rtv/media/media_files/2025/12/11/panchayat-elections-2025-2025-12-11-07-02-06.jpg)
Telangana Panchayat Elections 2025 Live
Telangana Panchayat Elections 2025 Live:
తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్లు సులభంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది.
పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. అదే రోజున ఫలితాలను కూడా ప్రకటించనున్నారు. ఈ రెండో దశ ఎన్నికల్లో భాగంగా 193 మండలకుగాను మొత్తం 4,332 సర్పంచ్ స్థానాల్లో 415 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవంగా తేలాయి. అలాగే 38,322 వార్డు స్థానాలకు గాను 8,300 స్థానాలు ముందుగానే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన సర్పంచ్, వార్డు స్థానాల కోసం నేడు పోలింగ్ నిర్వహించనున్నారు.
పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత పెంచారు. పోలింగ్‌తో పాటు కౌంటింగ్ కూడా సజావుగా సాగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు మొత్తం మూడు దశల్లో నిర్వహిస్తున్నారు. తొలి దశ ఎన్నికలు డిసెంబర్ 11న పూర్తయ్యాయి. నేడు డిసెంబర్ 14న రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. మూడూ, చివరి దశ ఎన్నికలు డిసెంబర్ 17న జరగనున్నాయి.
గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే పంచాయతీలకు ప్రతినిధులను ఎన్నుకునే ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఎన్నికలు సాఫీగా, న్యాయంగా జరగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.
- Dec 14, 2025 13:11 IST
రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు ముగిసిన పోలింగ్
- ప్రశాంతంగా ముగిసిన రెండోవిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
- 3,911 సర్పంచ్ స్థానాలు, 29,917 వార్డు స్థానాలకు ముగిసిన పోలింగ్
- మధ్యాహ్నం 2 గంటల నుంచి గ్రామపంచాయతీల్లో ఓట్ల లెక్కింపు
- 3,911 సర్పంచ్, 71,071 మంది వార్డు అభ్యర్థుల్లో ఉత్కంఠ
- మధ్యాహ్నం 3 గం. నుంచి వెలువడనున్న ఎన్నికల ఫలితాలు
- ముందుగా వార్డుసభ్యుల ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్న అధికారులు
- వార్డు సభ్యుల ఫలితాల ప్రకటన అనంతరం సర్పంచ్ ఫలితాలు వెల్లడి
- రెండో విడతలో 4,332 సర్పంచ్ స్థానాలకుగానూ 415 ఏకగ్రీవం
- Dec 14, 2025 12:07 IST
ఉదయం 11 గం. వరకు రాష్ట్రంలో 56.71శాతం పోలింగ్ నమోదు
- Dec 14, 2025 12:07 IST
చౌటుకూరు మండలం శివంపేటలో ఉద్రిక్తత
- సంగారెడ్డి: చౌటుకూరు మండలం శివంపేటలో ఉద్రిక్తత
- సంగారెడ్డి: శివంపేటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
- ఘర్షణకు దిగిన ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు
- Dec 14, 2025 11:15 IST
మెదక్
మనోహరాబాద్ (మం) కొనాయపల్లి పీటీలో బీజేపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య గొడవ...
ఒకరి పై ఒకరు దాడిచేసుకున్న ఇరు వర్గాలు
ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు...
పోలింగ్ కేంద్రం సమీపంలో ప్రచారం చేస్తున్నారని ఇరుపార్టీల పరస్పర ఆరోపణలు..
- Dec 14, 2025 09:55 IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం విద్యానగర్ గ్రామపంచాయతీ పరిధిలో ఈకె విద్యాలయంలో తన ఓటు హక్కు వినియోగించుకున్న కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు...
- Dec 14, 2025 09:50 IST
సంగారెడ్డి
ఎన్నికల్లో పోలీస్ కర్తవ్యంతో పాటు తల్లి ప్రేమను చూపిన కానిస్టేబుల్
చంటి పాపతో ఓటేయడానికి వచ్చిన తల్లి
పోలింగ్ కేంద్రంలోకి తల్లి వెళ్లడంతో పాపని కాసేపు లాలించిన మహిళా కానిస్టేబుల్.
- Dec 14, 2025 09:01 IST
Panchayat Elections 2025
Panchayat Elections 2025 సిద్దిపేట జిల్లా.......
వర్గల్ మండలం వేలూరు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా వార్డు సభ్యునిగా పోటీ చేసిన సమ్మరి కానీ నర్సింలు వ్యక్తి రూపాయలు రెండు లక్షలు తన వార్డులో పంపిణీ చేయగా అతనికి కేవలం ఆరు ఓట్లు మాత్రమే వచ్చాయి.
అతను ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఓటర్ల దగ్గరికి వెళ్లి తిరిగి వసూలు చేసుకోవడం చర్చ నియాంశంగా మారింది.
- Dec 14, 2025 08:40 IST
తెలంగాణలో రెండోవిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్, మ.2గంటల నుంచి కౌంటింగ్
3,911 పంచాయతీలు, 29,917 వార్డులకు పోలింగ్
సర్పంచ్ పదవులకు 12,834 మంది అభ్యర్థులు పోటీ
వార్డుల బరిలో 71,071 మంది అభ్యర్థులు
ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8,307 వార్డులు ఏకగ్రీవం
- Dec 14, 2025 07:33 IST
Telangana Panchayat Elections 2025 : నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికలు..బారులు తీరిన ఓటర్లు

Follow Us
/fit-in/580x348/filters:format(webp)/rtv/media/media_files/2025/11/27/elections-2025-11-27-08-39-04.jpg)