🔴 LIVE NEWS: కల్వకుంట్ల ఫ్యామిలీలో కవిత తప్ప ఎవరూ ఇవ్వలేదు : మంత్రి పొన్నం

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Feb 03, 2025 14:00 IST

    కల్వకుంట్ల ఫ్యామిలీలో కవిత తప్ప ఎవరూ ఇవ్వలేదు : మంత్రి పొన్నం

    కులగణనపై చర్చ జరిగేటప్పుడైనా KCR అసెంబ్లీకి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సర్వే కోసం ఇంటికెళ్తే కొందరు వివరాలు ఇవ్వలేదన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీలో కవిత తప్పా ఎవరూ కులగణనలో లెక్కలు చెప్పాలేదని ఆయన చెప్పారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడారు.

    ponnam 2



  • Feb 03, 2025 12:20 IST

    ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఎన్నికలు ఎప్పుడంటే...

    తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌ విడుదలైన వెంటనే నామినేషన్ల స్వీకరణ కూడా మొదలైంది. ఈ నెల 10 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.

    MLC-Elections
    MLC-Elections

     



  • Feb 03, 2025 11:28 IST

    ఇండియాలో పుట్టి ,పెరిగిన సింగర్‌కు గ్రామీ అవార్డ్

    సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డ్స్ ప్రదానోత్సవం లాస్‌ఏంజెలెస్‌‌లో జరిగింది. చైన్నైలో పుట్టి పెరిగిన సింగర్‌ చంద్రికా టాండన్‌కు ఈ అవార్డ్ దక్కింది. ఆమె క్రియేట్ చేసిన త్రివేణి బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్ ఆర్ చాంట్ ఆల్బమ్‌గా నిలిచింది.

    chandrika tandon
    chandrika tandon Photograph: (chandrika tandon)

     



  • Feb 03, 2025 11:27 IST

    కుప్పకూలిన ప్రపంచ స్టాక్ మార్కెట్లు.. ట్రంప్ దెబ్బకు చరిత్రలో మొదటిసారి..

    ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత చరిత్రలో మొదటిసారి రూపాయి విలువ భారీగా పతమవుతోంది. నిఫ్టీ కూడా 200 పాయింట్లు తగ్గింది. మెక్సికో, కెనడా, చైనాలపై అమెరికా సుంకాల ఎఫెక్ట్ భారీగా పడింది.

    Stock Market crash
    Stock Market crash Photograph: (Stock Market crash )

     



  • Feb 03, 2025 10:56 IST

    ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. హాల్ టికెట్లపై కీలక అప్‌డేట్

    ఇంటర్మీడియేట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ హాల్ టికెట్లను TGBIE విడుదల చేసింది. ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 3(ఈరోజు) ప్రారంభమై 2 షిఫ్ట్‌లలో జరుగుతాయి. థియరీ ఎగ్జామ్స్ మార్చి 5న ఫస్లియర్‌, మార్చి 6 నుంచి సెకండియర్‌ వాళ్లకు ప్రారంభమవుతాయని TSBIE గతంలోనే ప్రకటించింది.

    TS inter
    TS inter Photograph: (TS inter )

     



  • Feb 03, 2025 09:48 IST

    ఇజ్రాయిల్ స్పైవేర్ కారణంగా వాట్సాప్ అకౌంట్లు హ్యాక్

    వాట్సాప్ అకౌంట్లు హ్యాక్ అయినట్లు మెటా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 90 మంది అకౌంట్స్ సైబర్ అటాక్‌కు గురైనట్లు తెలిపింది. ఇజ్రాయిల్ స్పైవేర్ పారగాన్ దీనికి కారణమని మెటా అధికారులు చెప్పారు. జర్నలిస్టులు, నాయకుల వాట్సాప్ హ్యాక్ అయినట్లు గుర్తించారు.

    whatsapp hack
    whatsapp hack Photograph: (whatsapp hack)

     



  • Feb 03, 2025 09:29 IST

    పిల్లల్ని, విజ్జిని చూస్తుంటే బాధేస్తోంది...కంటతడి పెట్టిస్తున్న తణుకు ఎస్సై మూర్తి చివరి మాటలు!

    తణుకు రూరల్‌ ఎస్సై ఏజీఎస్‌ మూర్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఆయన తన స్నేహితునితో మాట్లాడిన ఆడియో వెలుగులోకి వచ్చింది. అందులో ఆయన తన భార్య పిల్లల గురించి అన్న మాటలు అందర్ని కంతడి పెట్టిస్తున్నాయి.

    tanuku si
    tanuku si

     



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు