మంత్రి ఉత్తమ్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. హుజూర్ నగర్ నుంచి జాన్ వహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా మంత్రి ఉన్న కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుకాల ఉన్న 8 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదం నుంచి మంత్రి ఉత్తమ్ సురక్షితంగా బయటపడ్డారు.
uttam convoy Photograph: (uttam convoy)
Jan 24, 2025 09:35 IST
బీజేపీ నుంచి నాకు సీఎం ఆఫర్ .. మనీష్ సిసోడియా సంచలన కామెంట్స్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తాను తీహార్ జైలులో ఉన్న సమయంలో బీజేపీలొ చేరితే ఆప్ ఎమ్మెల్యేలను విడగొట్టి, సీఎం పదవి ఇస్తామని ఆఫర్ చేసిందని సిసోడియా ఆరోపించారు. ఆ ఆఫర్‌ను తిరస్కరిస్తే జీవితకాలం జైల్లోనే ఉండాల్సి వస్తుందని తనను హెచ్చరించిందన్నారు.
మధ్యప్రదేశ్ లో ఓ వ్యక్తి బిచ్చమేసిందుకు గానూ అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 223 కింద అతనిపై కేసు నమోదైంది. ఈ మధ్యనే ఇండోర్ లో బిచ్చం వేయడం, స్వీకరించడాన్ని నిషేధించింది అక్కడ ప్రభుత్వం. అందుకే ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో తన మొదటి భారత పర్యటన నిమిత్తం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గెరిటా గౌరవ స్వాగతం పలికారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రబోవో చీఫ్ గెస్టుగా హాజరుకానున్న సంగతి తెలిసిందే.
Prabowo Subianto Photograph: ( Prabowo Subianto)
Jan 24, 2025 07:49 IST
ట్రంప్కు బిగ్ షాక్.. భారతీయులకు బిగ్ రిలీఫ్!
అమెరికాకు వలస వచ్చిన వారి పిల్లలకు జన్మత: వచ్చే పౌరసత్వ హక్కును ట్రంప్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు సియాటెల్ కోర్టు జడ్డి జాన్ కఫెనర్ ప్రకటించారు. ఆ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
US judge blocks Donald Trump's executive order Photograph: ( US judge blocks Donald Trump's executive order)
Jan 24, 2025 07:49 IST
మస్క్ క్షమాపణలు చెప్పాల్సిందే!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌పై ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. తమ దేశంపై ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన భార్య ఆర్తి అహ్లావత్ నుంచి విడాకులు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో పాటు కొన్ని నెలలుగా విడిగా ఉంటున్నట్లు సమాచారం. 2004లో వీరికి పెళ్లి కాగా, ఇద్దరు కుమారులున్నారు.
జమ్మూ కశ్మీర్ లో ఆగని మిస్టరీ మరణాలు..200 మంది క్వారంటైన్ కేంద్రాలకు!
రాజౌరీలోని బధాల్ గ్రామంలో మిస్టరీ మరణాలు ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాయి. దీని వెనుక కారణం ఏంటో సరైన కారణం తెలియడం లేదు. దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. దాదాపు 200 మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.
jammu
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
సంబంధిత కథనాలు
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి