Uttam Kumar Reddy Accident: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి తప్పిన ప్రమాదం

మంత్రి ఉత్తమ్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. హుజూర్ నగర్ నుంచి జాన్ వహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా మంత్రి ఉన్న కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుకాల ఉన్న 8 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదం నుంచి మంత్రి ఉత్తమ్ సురక్షితంగా బయటపడ్డారు.

author-image
By Krishna
New Update
uttam convoy

uttam convoy Photograph: (uttam convoy)

Uttam Kumar Reddy Accident: తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ శుక్రవారం  ప్రమాదానికి గురైంది. ఉత్తమ్ తన నియోజకవర్గమైన హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా సూర్యాపేట మండల కేంద్రమైన గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిలబడి ఉండటం చూసి మంత్రి కారును ఆపమని డ్రైవర్ కు సూచించారు.

Also Read :  ఆస్కార్‌కి ప్రియాంక చోప్రా ‘అనూజ’ షార్ట్ ఫిల్మ్ నామినేట్!

డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో..

దీంతో  డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుకాల ఉన్న 8 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనతో కార్ల బానెట్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు.  ఈ ప్రమాదం నుంచి మంత్రి ఉత్తమ్ సురక్షితంగా బయటపడటంతో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఊపిరి పిల్చుకున్నారు.  దీంతో అక్కడ ఒక్కసారిగా ట్రాఫిక్ ఏర్పడింది.  అనంతరం మంత్రి కారు వెళ్లిపోవటంతో పోలీసులు వచ్చి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. 

Also Read :   కన్నప్ప సినిమాలో నంది క్యారెక్టర్ లో ప్రభాస్..స్పెషల్ సాంగ్

ఇటీవల  మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కారుకు కూడా పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో వాహనం అదుపుతప్పింది. అయితే వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ముప్పు తప్పింది. వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా తిరుమలాయపాలెం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం తప్పడంతో సిబ్బంది వెంటనే ఆయన్ని మరో కారులో ఖమ్మంకు తరలించారు. 

Also Read :  నాలుగో రోజు కంటిన్యూ .. దిల్ రాజు ఇళ్లల్లో కొనసాగుతున్న ఐటీ దాడులు

 

Also Read  :  భలే ఛాన్స్ మిస్‌.. విశ్వనాథ్ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు