/rtv/media/media_files/2025/01/24/yVNoteVkEJbAD6EiAsvC.jpg)
US judge blocks Donald Trump's executive order Photograph: ( US judge blocks Donald Trump's executive order)
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న డోనాల్డ్ ట్రంప్ కు ఊహించని షాక్ తగిలింది. వలస వచ్చిన వారి పిల్లలకు జన్మత: వచ్చే పౌరసత్వ హక్కును ట్రంప్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై అమెరికాలో సియాటిల్ ఫెడరల్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుని ట్రంప్ కు షాకిచ్చింది. ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు సియాటెల్ కోర్టు జడ్డి జాన్ కఫెనర్ ప్రకటించారు. ఆ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆర్డర్‌ను సవాల్ చేస్తూ పలు రాష్ట్రాలు కోర్టులకెక్కిన విషయం తెలిసిందే. ట్రంప్ ఆర్డర్ ప్రకారం అమెరికాకు వలస వెళ్లిన వారికి పిల్లలు పుడితే పౌరసత్వం రాదు.
Judge John Coughenours said that President Trump’s executive order ending birthright citizenship was “blatantly unconstitutional” and issued a temporary restraining order to block it.... “I have been on the bench for over four decades. I can’t remember another case whether the…
— Janice England (@PITSfounder) January 24, 2025
రద్దు చేసిన ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తాత్కాలికంగా నిలిచిపోయిన విసియాటెల్ జడ్జి ఆదేశాల ప్రకారం ఆ ఆర్డర్ దేశ వ్యాప్తంగా 14 రోజుల పాటు అమలు కాదు. అలాగే, విచారణ సమయంలో జడ్జి మాట్లాడుతూ ఈ ఉత్తర్వు రాజ్యాంగబద్ధమైందని బార్‌లోని సభ్యుడు నిస్సందేహంగా ఎలా చెప్పగలరో అర్థం కావడం లేదన్నారు. ఇది తన మనసును కలవరపెడుతోందని చెప్పుకొచ్చారు.
అమెరికాలో జన్మత: వచ్చే పౌరసత్వాన్ని డోనాల్డ్ ట్రంప్ రద్దు చేయడంతో అక్కడి భారతీయుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా, అధ్యక్షుడి నిర్ణయాన్ని సియాటెల్ జడ్జి తాత్కాలికంగా నిలిపేయడంతో వారికి భారీ ఊరట లభించింది. ఫిబ్రవరి 20 తర్వాత పుట్టిన వారికి సిటిజన్ షిప్ రాదనే ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇండియన్స్‌తో పాటు అమెరికాకు వలస వెళ్లిన వారిని టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే ఈ పౌరసత్వ రద్దుకు సంబంధించి 22 రాష్ట్రాలు, పలు పౌరసంఘాలు కోర్టుల్లో పలు దావాలు వేశాయి.