కాపురంలో కలహాలు.. వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి విడాకులు!

మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన భార్య ఆర్తి అహ్లావత్ నుంచి విడాకులు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో పాటు కొన్ని నెలలుగా విడిగా ఉంటున్నట్లు సమాచారం.  2004లో వీరికి పెళ్లి కాగా, ఇద్దరు కుమారులున్నారు.

New Update
Virender Sehwag, Aarti Ahlawat

Virender Sehwag, Aarti Ahlawat Photograph: (Virender Sehwag, Aarti Ahlawat)

టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన వివాహ బంధానికి స్వస్తి పలకనున్నట్లు తెలుస్తోంది. తన భార్య ఆర్తి అహ్లావత్ నుంచి విడాకులు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో పాటు కొన్ని నెలలుగా విడిగా ఉంటున్నట్లు సమాచారం.  2004లో వీరికి పెళ్లి కాగా, ఇద్దరు కుమారులున్నారు. ఆర్యవీర్, 2007లో జన్మించగా..  వేదాంత్ 2010లో జన్మించారు. 

గత దీపావళి రోజు సెహ్వాగ్ ఒంటరిగా ఉన్న ఫొటోలు షేర్ చేయడం విడాకుల వార్తకు మరింత బలం చేకూరుస్తోంది. దీనికి తోడు రెండు వారాల క్రితం, వీరేంద్ర సెహ్వాగ్  పాలక్కాడ్‌లోని విశ్వ నాగయక్షి ఆలయాన్ని ఒంటరిగానే సందర్శించారు. దీంతో ఈ జంట కొన్ని రోజులుగా విడిగా ఉంటోందని సన్నిహత వర్గాలు తెలిపాయి. అందుకే బహిరంగంగా కలిసి కనిపించడం లేదని పేర్కొన్నాయి.

న్యూఢిల్లీకి చెందిన ఆర్తీ అహ్లావత్ చాలా వరకు తక్కువ ప్రొఫైల్‌ను కొనసాగించారు. 1980డిసెంబరు 16న జన్మించిన ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని మైత్రేయి కళాశాల నుండి కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా పూర్తి చేశారు. దీనికి ముందు లేడీ ఇర్విన్ సెకండరీ స్కూల్, భారతీయ విద్యాభవన్‌లో తన విద్యను అభ్యసించారు. వీరేంద్ర 2015లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. తన వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా గోప్యంగా ఉంచుతూ వచ్చారు సెహ్వాగ్.  ఈ విడాకుల వార్తలపై సెహ్వాగ్ లేదా ఆర్తిల నుంచి ఎలాంటి ప్రకటనలు రాకపోవడం అభిమానులను షాక్ కు గురిచేస్తోంది.  

Also Read :  Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌ లో ఆగని మిస్టరీ మరణాలు..200 మంది క్వారంటైన్‌ కేంద్రాలకు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు