🛑LIVE BREAKINGS: అమెరికా ట్రెజరీపై చైనా సైబర్ దాడి

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Dec 31, 2024 09:24 IST

    అమెరికా ట్రెజరీపై చైనా సైబర్ దాడి

    తన ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ మీద చైనా సైబర్ దాడులకు పాల్పడిందని అమెరికా ఆరోపిస్తోంది. వర్క్ స్టేషన్లలో కీలక పత్రాలను దొంగలించేందుకు ప్రయత్నించినట్లు తెలిపింది. డిసెంబర్‌ ప్రారంభంలో ఈ సైబర్‌ దాడి జరిగినట్లు చెప్పింది.  

     Treasury
    US Treasury

     



  • Dec 31, 2024 08:03 IST

    బాలాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం

    హైదరాబాద్‌లో అర్థరాత్రి సమయంలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బాలాపూర్‌లోని ప్లాస్టిక్ గోడౌన్‌‌లో అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందితో మంటలను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

    Also Read : https://rtvlive.com/crime/hyderabad-fire-broke-out-in-a-plastic-godown-in-balapur-8579481



  • Dec 31, 2024 08:02 IST

    పోలీస్‌ స్టేషన్‌లోనే ఎస్‌ఐపై దాడి

    వైఎస్సార్ జిల్లాకి చెందిన ఓ ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా ఓ కారు ఢీకొట్టింది. పోలీసులు వెంటనే కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చారు. అయితే యాక్సిడెంట్‌కి కారణమైన వారిని ఎస్‌ఐ వదిలేశాడని గాయపడిన వారి కుటుంబ సభ్యులు అతనిపై దాడికి పాల్పడ్డారు.



  • Dec 31, 2024 08:01 IST

    Year Ender 2024: 2024లో కనిపించని పెద్ద హీరోలు

    వచ్చే ఏడాది సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. కానీ 2024లో మాత్రం పెద్ద హీరోలు మాత్రం చాలా కామ్‌గా ఉండిపోయారు. చిరు, వెంకటేష్, రామ్ చరణ్ లాంటివారు ఒక్క సినిమా కూడా చేయలేదు. 

    tollywood
    balakrishna, mega heros

     



  • Dec 31, 2024 08:00 IST

    Cricket: డ్రా మిస్ చేశారు..సీరీస్ ఆధిక్యంలో ఆస్ట్రేలియా



  • Dec 31, 2024 07:59 IST

    జనవరి 1 నుంచి ఈ 3 రకాల బ్యాంక్‌ అకౌంట్లు మూతపడనున్నాయి..వీటిలో మీ అకౌంట్‌ ఉందా చూసుకోండి మరి!

    లక్షలాది బ్యాంక్ ఖాతాలను ప్రభావితం చేసే కీలకమైన మార్పులను 2025 జనవరి 1న ఆర్​బీఐ అమల్లోకి తీసుకురాబోతుంది.మూడు రకాల బ్యాంకు ఖాతాలను ఆర్బీఐ బుధవారం నుంచి క్లోజ్‌ చేయనుంది.మరి ఇందులో మీ అకౌంట్‌ కూడా ఉందేమో చూసుకోండి.

    RBI



  • Dec 30, 2024 11:21 IST

    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం ఈ దేశానికి తీరని లోటు

    మౌనముని అంటూ ఎన్ని విమర్శలు వచ్చినా  ఆయన తన సహనాన్ని కోల్పోలేదు.



  • Dec 30, 2024 10:56 IST

    Manmohan Singh కు భారత రత్న ఇవ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి

    దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ మృతి చెందడంతో తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. మన్మోహన్ సింగ్ చేసిన విశిష్ట సేవలు గురించి సభలో సీఎం ప్రస్తావించారు. ఆయనకు భారత రత్న ఇవ్వాలని సీఎం రేవంత్ తెలిపారు.

    Revanth Reddy cm
    Revanth Reddy cm Photograph: (Revanth Reddy cm)

     



  • Dec 30, 2024 10:40 IST

    కానిస్టేబుల్‌తో SI రాసలీలలు.. కాల్ రికార్డింగ్ వైరల్ !

    నల్గొండ జిల్లాలో టాస్క్ ఫోర్స్ ఎస్సై మహేందర్ వివాహేతర సంబంధం పెట్టుకొని అడ్డంగా దొరికిపోయాడు. కొన్నాళ్లుగా ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ వసంతతో మహేందర్ ఎఫైర్‌ సాగిస్తున్నాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో భర్త మహేందర్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.



  • Dec 30, 2024 10:39 IST

    తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం

    తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. బూరుగుపూడి గేట్ దగ్గర ఉన్న అద్భుత రెసిడెన్సీలో రేవ్ పార్టీ జరుగుతుందని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని 5 గురు యువతులు, 12 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. 

    Bengaluru Rave Party: బెంగళూరు రేవ్‌ పార్టీపై ఏపీలో రాజకీయ దుమారం



  • Dec 30, 2024 08:22 IST

    భోజనాలు లేటయ్యాయని..పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్న పెళ్లికొడుకు!

    పెళ్లిలో భోజనాలు వడ్డించడంలో ఆలస్యమైందన్న కారణంతో పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకున్నాడు ఓ యువకుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చందౌలిలో జరిగిందీ. పెళ్లికూతుర్ని వదిలేసిన తరువాత వరుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

    marriage,



  • Dec 29, 2024 18:19 IST

    ఫ్యామిలీతో లండన్ లో చిల్ అవుతున్న తారక్.. వీడియో వైరల్

    జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతున్నాడు. షూటింగ్ నుంచి విరామం తీసుకుని ప్రస్తుతం లండన్‌లో తన కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతున్నారు. అక్కడ హైడ్ పార్క్‌లో పిల్లలతో కలిసి ఎన్టీఆర్ ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది .



  • Dec 29, 2024 18:03 IST

    తెలంగాణలో పోలీసుల వరుస ఆత్మహత్యలు.. డీజీపీ సంచలన వ్యాఖ్యలు

    2024కు సంబంధించి క్రైం రేటు వివరాల వార్షిక నివేదికను తెలంగాణ డీజీపీ జితేందర్ వెల్లడించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి.. ఏఏ కేసుల్లో ఎంత మందిని అరెస్టు చేశారన్న వివరాలను డీజీపీ వివరించారు.



  • Dec 29, 2024 17:56 IST

    మన్‌కీ బాత్‌లో అక్కినేని నాగేశ్వర్‌ రావు పేరు ప్రస్తావించిన మోదీ

    ప్రధాని మోదీ మన్‌కీ బాత్ 117వ ఎపిసోడ్‌లో ప్రముఖ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరును ప్రస్తావించారు. తెలుగు సినిమాను ఆయన మరో స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. అయితే సీనియర్ ఎన్టీఆర్‌ పేరును ప్రస్తావించకపోవడంతో ప్రధానిపై విమర్శలు వస్తున్నాయి.



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు