lashkar-e-taiba:ముంబై 26/11 దాడుల సూత్రధారి మృతి

ముంబై 26/11 దాడుల సూత్రధారి...లష్కరే తోయిబా ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవీ మరణించాడని ఐక్యరాజ్యసమితి ధృవీకరించింది. ఇతను హఫీజ్‌ సయీద్‌కు  డిప్యూటీగా ఉండేవాడు. హఫీజ్ గుండెపోటుతో మరణించాడని తెలిపింది.

lashkar-e-taiba:ముంబై 26/11 దాడుల సూత్రధారి మృతి
New Update

Mumbai attacks:మంబై 26/11 దాడికి లష్కరే తోయిబా ఉగ్రసంస్థ పాకిస్తాన్‌లో వ్యూహ రచన చేసింది. దీనికి సంబంధించి ఎన్నో ఆధారాలను భారత్ బయటపెట్టింది. పాక్ దేశ మాజీ జాతీయ భద్రతా సలహాదారు మహ్మాద్ అలీ దురానీ కూడా దీనిని ధ్రువీకరించారు కూడా. ఇప్పుడు ఈ దాడికి వ్యూహ రచన చేసిన హీఫీజ్ సలామ్ భుట్టావి మరణించాడని ఐక్యరాజ్యసమితి ధృవీకరించింది. మంబుదాడుల్లో ఇతను కీలక కుట్రదారుడు. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు సలామ్ భుట్టావి డిప్యూటీగా ఉండేవాడు. సలామ్ గత ఏడాది మేలో గుండెపోటుతో మరణించాడని ఐక్యరాజ్యసమితి తెలిపింది.

Also read:పండుగ వేళ భారీగా తగ్గిన బంగారం ధరలు..వెంటనే కొనేయండి మరీ!

పదిహేనేళ్ళ చేదు జ్ఞాపకం..

ముంబైలో 2008 నవంబర్ 26న పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాదులు 12 చోట్ల పేలుళ్లకు పాల్పడ్డారు. మూడు రోజుల పాటు నరమేధాన్ని సృష్టించారు. ఈ దాడి జరిగి ఇప్పటికీ 15 ఏళ్ళు గడిచినా ప్రతీ భారతీయుడికి కళ్ళ ముందు కదలాడుతున్నట్టే ఉంటుంది. ప్రపంచ ఉగ్రవాద దాడుల్లోనే అత్యంత ఘోరమైన ఘటనగా ఇది చరిత్రలో నిలిచిపోయింది. బాధితులకు ఇప్పటికీ ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. 2008 నవంబరు 26న పాకిస్థాన్‌లోని కరాచీ రేవు నుంచి అరేబియా సముద్రం ద్వారా లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన అజ్మల్ కసబ్, మరో తొమ్మిది మంది ముంబైలోకి చొరబడ్డారు. ఒబెరాయ్ హోటల్, తాజ్, ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ల వద్ద నాలుగు రోజుల పాటు మారణహోమం సృష్టించారు. హోటల్స్‌లో ఉన్న దేశ విదేశీయులను బంధీలుగా చేసుకొని రెచ్చిపోయారు. లోపలి దాగి ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భారత దళాలకు మూడు రోజులకు పైగా సమయం పట్టింది. పది మంది ఉగ్రవాదుల్లో తొమ్మిది మందిని అప్పుడే మట్టుబెట్టారు భారత సౌన్యం. అజ్మల్ కసబ్‌ ను మాత్రం తరువాత ఉరి తీశారు. ఈ దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోగా...300 మంది దాకా గాయపడ్డారు. హేమంత్ కర్కరే లాంటి పోలీసులు అమరవీరులయ్యారు.

కస్టడీలోనే మృతి...

హఫీజ్ సలామ్ భుట్టావికి 77 ఏళ్ళు. ఇతను ఇన్నాళ్ళూ పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని మురిడ్కేలో ఆ దేశ ప్రభుత్వ కస్టడీలో ఉన్నాడు. నిర్భంధంలో ఉండగానే మే 29న భుట్టావి మరణించాడని ఐక్యరాజ్య సమితి తెలిపింది.

#mumbai #attack #death #lashkar-e-taiba #26-11
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe