CM Revanth : గుడ్‌న్యూస్‌.. రాష్ట్రంలో పెరగనున్న భూమి ధరలు

తెలంగాణలో వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం పెంచేందుకు అధికారులు ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బడ్జెట్‌లో నిర్దేశించిన మేరకు రాబడి తెచ్చేందుకు నెలవారి టార్గెట్‌తో పనిచేయాలని అధికారులకు సూచించారు.

CM Revanth : గుడ్‌న్యూస్‌.. రాష్ట్రంలో పెరగనున్న భూమి ధరలు
New Update

Land Rates Rise : తెలంగాణ(Telangana) లో వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం పెంచేందుకు అధికారులు ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం శాఖల మధ్య సమన్వయం ఉండాలని.. పన్నుల ఎగవేత విషయంలో లోసుగులు లోకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. బడ్జెట్‌లో నిర్దేశించిన మేరకు రాబడి తెచ్చేందుకు నెలవారి టార్గెట్‌తో పనిచేయాలని అధికారులకు సూచించారు.

Also read: సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడిగా కపిల్‌ సిబల్‌!

గత ఏడాది వచ్చిన ఆదాయంపై అసంతృప్తిని వ్యక్తం చేసిన సీఎం.. జీఎస్టీ(GST) ఎగవేత లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంచనా మేరకు జీఎస్టీ సాధించడంలో క్షేత్రస్థాయి పరిశీలనలు, ఆడిటింగ్‌లను పకడ్బందీగా జరపాలని.. జీఎస్టీ ఎగవేతదారులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అక్రమ మద్యం రవాణాను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వం 2021లో భూముల విలువను(Land Rates), రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచిందని.. అయినప్పటికీ చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు, ప్రతిపాదించిన ధరలకు భారీ తేడా ఉందన్నారు. నిబంధనల ప్రకారం ఏడాదికోసారి భూముల మార్కెట్ విలువను సవరించాల్సి ఉంటుంది కాబట్టి.. ధరల సవరణకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

రాష్ట్ర రాబడి పెంపుతో పాటు స్థిరాస్థి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భూముల మార్కెట్ ధరల సవరణ జరగాలన్నారు. స్టాంప్‌ డ్యూటీ తగ్గించడమా లేక పెంచడమా అన్న విషయంలో ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత లేకుండా సర్దుబాటు చేయాలని. అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాల కోసం అధునాతన మోడల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులు నిర్మించాలన్నారు. అలాగే సామాన్యులకు ఇసుక కొరత లేకుండా అక్రమ రవాణాను, లీకేజీలను అరికట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారు.

Also Read: కామన్ అడ్మిషన్లకు కాలం చెల్లు.. ఏపీ కోటాకు బ్రేక్!

#cm-revanth #telugu-news #telangana #land-rates
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe