Maldives: లక్షద్వీప్‌తో మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటీ.. స్థానిక ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. లక్షద్వీప్ అభివృద్ధి చెందితే మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటంటూ అక్కడి ఎంపీ మహమ్మద్ ఫైజల్ ప్రశ్నించారు. లక్షద్వీప్‌లో ఏం జరుగుతుందో అనేదానిపై.. ఆ ప్రాంతంలో భవిష్యత్తు పర్యాటక రంగంపై ప్రధాని మోదీ మాట్లాడిన దానిపై మాల్దీవులు ఎందుకు స్పందించాలంటూ నిలదీశారు. By B Aravind 08 Jan 2024 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి Maldives vs Lakshadweep: ప్రస్తుతం దేశంలో లక్షద్వీప్ VS మాల్దీవులు అనే వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల ప్రధాని మోదీ (PM Modi) లక్షద్వీప్‌లను సందర్శించి అక్కడి ప్రదేశాలను కొనియాడుతూ తన అనుభవాలను పంచుకోగా.. దీనిపై మాల్దీవులకు చెందిన మంత్రులు ప్రధాని మోదీపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై తాజాగా లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ (Mohammed Faizal) స్పందించారు. లక్షద్వీప్ అభివృద్ధి చెందితే మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అలాగే భవిష్యత్తులో లక్షద్వీప్ అనేది పర్యాటక ప్రాంతంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ' లక్షద్వీప్‌లో ఏం జరుగుతుందో అనేదానిపై.. ఆ ప్రాంతంలో భవిష్యత్తు పర్యాటక రంగంపై ప్రధాని మోదీ మాట్లాడిన దానిపై మాల్దీవులు ఎందుకు స్పందించాలి. భవిష్యత్తులో కచ్చితంగా లక్షద్వీప్ ఓ కొత్త గమ్యస్థానంగా మారుతుంది. యువతకు ఉద్యోగాలు వస్తాయి ప్రధాని మోదీ లక్షద్వీప్‌కు (Lakshadweep) వచ్చి ఒక రోజు ఉన్నారు. పర్యటక రంగంపై లక్షద్వీప్ ప్రజలు కోరుకున్న దానిపై ప్రధాని మాట్లాడారు. పర్యాటక రంగంపై ఈ ప్రభుత్వానికి ఓ పాలసీ ఉండాలని నేను ఎప్పటికీ కోరుకుంటూనే ఉన్నాను. దీనివల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయి. ఇలా జరిగితే మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటీ' అంటూ ఎంపీ మహమ్మద్ ఫైజల్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించగా.. మాల్దీవులకు చెందిన మంత్రులు షివునా, మల్షా షరీఫ్, అబ్దుల్లా మజూం అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో భారతీయులు వీళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్రం కూడా వీరిపై మండిపడింది. Also Read: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు మాల్దీవుల మంత్రులపై పెద్ద స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. వీళ్లు చేసిన వ్యాఖ్యలను భారత హైకమిషన్ వర్గాలు సైతం మాల్దీవుల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో అక్కడి ప్రభుత్వం వీళ్లపై చర్యలు చేపట్టింది. ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఈ ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది. ఇక భారత్ - మాల్దీవుల మధ్య దౌత్యపరంగా వివాదం తలెత్తడంతో.. తాజాగా భారత విదేశాంగ శాఖ మాల్దీవుల దౌత్యవేత్త ఇబ్రహీం షాహీబ్‌కు సమన్లు పంపింది. దీంతో ఆయన సోమవారం ఉదయం భారత విదేశాంగ శాఖ కార్యాలయానికి వెళ్లొచ్చారు. #WATCH | On Maldives MP's post on PM Modi's visit to Lakshadweep, Lakshadweep MP Mohammad Faizal says "...Why should Maldives say something about what is going to happen in Lakshadweep and what PM Modi spoke on the future of tourism in Lakshadweep. One thing is sure that… pic.twitter.com/URDLQrEpLs — ANI (@ANI) January 7, 2024 Also Read: పేదలకు గుడ్ న్యూస్.. శివరాత్రికి కొత్త రేషన్ కార్డులు? #telugu-news #national-news #lakshadweep #maldives #modi-in-lakshadweep మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి