Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు మరో షాక్.. NIA విచారణకు ఆదేశం సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థ 'సిఖ్ ఫర్ జస్టీస్' నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు అందాయనే ఆరోపణలతో దర్యాప్తు చేయాలని ఎల్జీ.. ఎన్‌ఐఏకు సిఫార్సు చేశారు. By B Aravind 06 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి NIA : లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) జరుగుతున్న వేళ.. రాజకీయాల్లో కీలక పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయి. దేశంలో సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయనపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థ 'సిఖ్ ఫర్ జస్టీస్' నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) కి నిధులు అందాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని లెఫ్డినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఎన్‌ఐఏకు సిఫార్సు చేశారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ.. కేజ్రీవాల్‌పై ఎన్‌ఐఏ విచారణకు ఆదేశించడం సంచలనం రేపుతోంది. Also Read: క్రికెట్ బాల్ ప్రైవేట్ పార్ట్‌కు తగిలి 11 ఏళ్ల బాలుడు మృతి ఇదిలాఉండగా.. మార్చి 21వ తేదీన లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) ను ఈడీ అరెస్టు చేసింది. మరోవైపు ఇటీవల కేజ్రీవాల్ లోక్‌సభ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఆయన మధ్యంత బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. ఈడీ అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌కు సమయం పట్టే అవకాశం ఉన్నందున.. మధ్యంత బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పింది. మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను తాము వ్యతిరేకిస్తామని ఈడీ తరఫు అడిషినల్ సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు కోర్టులో వాదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. కేవలం పిటిషన్ మాత్రమే విచారిస్తామని.. బెయిల్ ఇస్తామని చెప్పడం లేదని తెలిపింది. చివరికి బెయిల్ ఇవ్వొచ్చు లేదా ఇవ్వకపోవచ్చు అని స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల వేళ.. కేడ్రీవాల్ జైలు నుంచి విడుదలవుతారా లేదా అనేది అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. Also Read: సముద్రంలో ఈతకు దిగి ఐదురుగు మెడికో విద్యార్థులు మృతి.. #nia #arvind-kejriwal #national-investigation-agency #khalisthan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి