Telangana: లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఎస్‌ఐ, సీఐ

హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌ వీరస్వామి, ఎస్ఐ షఫీ రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఏసీబీ అధికారులు వీళ్లని అదుపులోకి తీసుకున్నారు.

New Update
Telangana: లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఎస్‌ఐ, సీఐ

ACB Caught Kushaiguda CI & SI: ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటూ దొరికిపోతున్న సంఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని కుషాయిగూడలో ఇద్దరు పోలీసులు రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఇక వివరాల్లోకి వెళ్తే కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఓ భూవివాదం కేసులో రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా.. ఇన్‌స్పెక్టర్‌ వీరస్వామి, ఎస్ఐ షఫీలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే దీనికి మధ్యవర్తిగా వ్యవహరించిన ఉపేందర్‌ అనే మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.


ఉపేందర్ ద్వారా మధ్యవర్తిత్వం ఏర్పాటు చేసుకొని పోలీసులు బాధితులను లంచం డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. గతంలో వీళ్లపై ఉన్న ఆరోపణలపై కూడా అధికారులు ఫోకస్ పెట్టారు. గుర్రంగూడకు దగ్గర్లో ఉన్న ఇన్‌స్పెక్టర్ వీరస్వామి ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు.

Also Read: ప్రైవేట్‌ స్కూల్లకు అలెర్ట్.. వాటిని అమ్మడం నిషేధం

Advertisment
Advertisment
తాజా కథనాలు