Hyderabad: ప్రైవేట్‌ స్కూల్లకు అలెర్ట్.. వాటిని అమ్మడం నిషేధం

హైదరాబాద్‌లో ప్రైవేట్‌ స్కూల్స్‌లో (STATE, CBSC, ICSE) యూనిఫామ్, షూస్, బెల్టులు అమ్మడాన్ని నిషేధిస్తూ.. హైదరాబాద్ జిల్లా ఎడ్యుకేషనల్‌ అధికారి ఆదేశాలు జారీ చేశారు. స్టేషనరీ, పుస్తకాలు వంటివి మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ మీద అమ్ముకోవచ్చు.

New Update
Hyderabad: ప్రైవేట్‌ స్కూల్లకు అలెర్ట్.. వాటిని అమ్మడం నిషేధం

హైదరాబాద్‌లో ప్రైవేట్‌ స్కూల్స్‌లో యూనిఫామ్, షూస్, బెల్టులు అమ్మడం నిషేధించబడింది. STATE, CBSE, ICSE పాఠశాలలకు ఈ నిబంధన వర్తిస్తుంది. అయితే స్టేషనరీ, పుస్తకాలు వంటివి మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ మీద అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా ఎడ్యుకేషనల్‌ అధికారి రోహిణి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రైవేట్ స్కూల్లలో ఈ నిబంధలను అమలు చేస్తున్నా లేదా అని పర్యవేక్షించేందుకు మండల స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేయాలని డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ అధికారులను ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Also Read: కటింగ్ నచ్చలేదని ఒకరు.. ఎండలో ఆడొద్దన్నందుకు మరొకరు.. 9 ఏళ్ల చిన్నారుల ఆత్మహత్యలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు