Minister KTR: కాంగ్రెస్, బీజేపీ పార్టీల డబ్బులు తీసుకోండి.. కారుకు ఓటేయండి!

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. గంభీరావుపేట మండల పరిధిలోని 4 గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు సంబంధించిన పత్రాలను లబ్దిదారులకు అందజేశారు.

Minister KTR: కాంగ్రెస్, బీజేపీ పార్టీల డబ్బులు తీసుకోండి.. కారుకు ఓటేయండి!
New Update

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. గంభీరావుపేట మండల పరిధిలోని 4 గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు సంబంధించిన పత్రాలను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఒకే రోజు నాలుగు గ్రామాల్లో 378 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తాను గతంలో నెలకు ఒక సారి సిరిసిల్లకు వచ్చే వాడినన్న ఆయన.. ప్రస్తుతం అలా రావడానికి సమయం ఉండటం లేదన్నారు.

రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ అభివృద్ధిలో ముందంజలో నిలిపారన్నారు. రాష్ట్రంలో విద్యకు ఎలాంటి ఢోకా లేకుండా స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని ఆయన గుర్తు చేశారు. 365 రోజులు మంచినీళ్లు, ఉచిత విద్యుత్, సాగునీరు అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. సీఎం కేసీఆర్‌ రైతులను దృష్టిలో పెట్టుకొని ఎన్నో గొప్ప పథకాలు తీసుకువచ్చారన్నారు. అందులో రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు ఉండటంతో ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేసినట్లు అవుతుందన్నారు.

మరోవైపు రైతుల ఖాతాలో ఒకేసారి 73 వేల కోట్ల రూపాయలు వేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది అన్నారు. కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్‌.. కాంగ్రెస్‌ నేతలు ఎప్పుడు పదవుల కోసం కొట్టుకుంటారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారి పదవులపై వారికే గ్యారెంటీ లేదన్నారు. అలాంటి పార్టీ ప్రజలకు గ్యారెంటీ కార్డులు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. దీనిని ప్రజలు నమ్ముతారని వారు అనుకోవడం వారి కర్మ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ లేనిపోని హామీలు ఇస్తూ ప్రజల్ని ఆయోమయానికి గురిచేస్తోందన్న ఆయన.. రాష్ట్ర ప్రజలు పొరపాటున కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మన బ్రతుకులు తిరిగి పాత రోజుల్లోకి వెళ్తాయన్నారు. లేనిపోని హామీలు ఇస్తున్న కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో డబ్బులు పంచమని అని చెప్పే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న డబ్బులు తీసుకొని బీఆర్‌ఎస్‌కు ఓటు వేయండని పిలుపునిచ్చారు.

#brs #congress #cm-kcr #minister #guarantee #ktr-rajanna-sirisilla #gambhiraopet-mandal #four-villages #378-double-bedroom-houses #cards
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe