KTR Fires On Congress Government : వరంగల్ లోక్ సభ(Warangal Lok Sabha) నియోజకవర్గ సన్నాహాక సమావేశానికి హాజరైన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ (KTR). పది సంవత్సరాల పాటు కేసీఆర్ విద్వంసమైన తెలంగాణ(Telangana) ను వికాసం వైపు మళ్లించారని అన్నారు. గ్రామీణ ఆర్థిక పరిపుష్టికి కేసీఆర్(KCR) కష్టపడ్డంతగా దేశంలో ఎవరూ కష్టపడలేదని పేర్కొన్నారు. తెలంగాణను సత్వరంగా అభివృద్ధి చేయాలన్న తపనతో 99 శాతం సమయాన్ని పాలనకే కేటాయించారని అన్నారు.
ప్రజలు మనతోనే..
ప్రజలు మనతో ఉన్నారనే ధీమాలో ఎన్నికల దాకా ఉన్నామని.. ఓరుగల్లు అంటే ఉద్యమాల వీరగడ్డ. వరంగల్ జిల్లాలోనూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే మన నేతలు ఓడిపోయారని కేటీఆర్ అన్నారు. ఓరుగల్లు మన జయశంకర్ సార్ పుట్టిన నేల.. 2014 ,2019 లలో వరంగల్ ఎంపీ సీటును బీఆర్ఎస్ గెలిచింది. ఈ సారి కూడా వరంగల్ లో గులాబీ జెండా ఎగరాలని అన్నారు.
లోపాలు సమీక్షించుకుంటాం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై(Telangana Assembly Elections Results) కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఎనిమిదో పార్లమెంట్ స్థానానికి సంబంధించిన సన్నాహక సమావేశమని అన్నారు. 'ఈ సమావేశాల్లో పార్టీ బలోపేతానికి ఎన్నో సూచనలు వస్తున్నాయి. పార్టీ పరంగా లోపాలు సమీక్షించుకుంటాం.. పార్లమెంటు ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసుకుంటాం' అని పేర్కొన్నారు.
టార్గెట్ పార్లమెంట్..
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పక్కనపెట్టి... పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) పై దృష్టి పెట్టి విజయం దిశగా పనిచేద్దాం అని కేటీఆర్ బీఆర్ఎస్ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తల్లో ఉత్సాహం యధావిధిగా ఉందని అన్నారు. ఇదే చైతన్యంతో పార్లమెంటు ఎన్నికల్లో గట్టిగా పని చేయాలని అన్నారు. మనల్ని ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదనే విషయం మనం గుర్తుంచుకొని ముందుకు పోదాం అని తెలిపారు.
420 హామీలు..
కాంగ్రెస్(Congress) ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదు.. 420 హామీలు.. ఇదే విషయాన్ని కార్యకర్తలు ప్రజలకు గుర్తు చేస్తూనే ఉండాలని కేటీఆర్ అన్నారు. 'కాంగ్రెస్ ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇద్దామనుకున్నాం, గవర్నర్ ప్రసంగం ,శ్వేత పత్రాలతో బీఆర్ఎస్ ను గత కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీయే మొదలు పెట్టింది. ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు మన మీద ఆకారణంగా నిందలు వేస్తె ఊరుకోము. అందుకే అసెంబ్లీ లో కాంగ్రెస్ ను గట్టిగా నిలదీశాం' అని అన్నారు.
ముందుంది అసలు సినిమా..
కేసీఆర్ కరెంటు పరిస్థితి బాగు చేశారని చిన్న పిల్ల వాడిని అడిగినా చెబుతారు... కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తే ప్రధాన ప్రతిపక్షంగా నిలదీస్తాం అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజలను వంచించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి సినిమా ఇంకా మొదలు కాలేదు, ఆసలు సినిమా ముందుంది అని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తన రక్తాన్ని రంగరించారు.. చెమట ధార పోశారని అన్నారు.
జిల్లాల రద్దు..
ప్రజలకు మంచి చేసే అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ అక్కస్సుతో రద్దు చేస్తుందని అన్నారు కేటీఆర్. వాటిపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంటున్నది, పేద గొంతుకలకు మనం అండగా ఉండాలని అన్నారు. సీఎం జిల్లాలు రద్దు చేస్తామని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు, జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. నెలరోజుల్లోనే కాంగ్రెస్ పాలన పై వ్యతిరేకత మొదలైందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు పేద ప్రజలను నష్టపరిచాయి.. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.
Also Read : ఆ 5 టికెట్లు ఇవ్వాల్సిందే.. జగన్ కు కేశినేని నాని పెట్టిన డిమాండ్లు ఇవే?