Komatireddy Venkat Reddy: బతుకమ్మ అని లిక్కర్ అమ్మింది.. కవితపై కోమటిరెడ్డి సెటైర్లు కృష్ణా జలాలపై మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదని ధ్వజమెత్తారు మంత్రి కోమటిరెడ్డి. 13న నల్లగొండ పట్టణ చౌరస్తాల్లో కేసీఆర్ బొమ్మ పెట్టి రైతులతో నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. బతుకమ్మ బతుకమ్మ అంటూ డిల్లీకి వెళ్లి లిక్కర్ అమ్మిన ఘనురాలు కవిత అని చురకలు అంటించారు. By V.J Reddy 11 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Minister Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై విమర్శలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రేపు నల్లగొండలో కేసీఆర్ చేపట్టబోయే సభపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్ అయ్యారు. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ నల్లగొండకు రావాలని అన్నారు. నల్లగొండకు కేసీఆర్ ఏ మొహం పెట్టుకొని వస్తున్నాడు..? అని ఫైర్ అయ్యారు. Also Read: టార్గెట్ 17.. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ: కిషన్ రెడ్డి కృష్ణా జలాలపై మాట్లాడే అర్హత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు లేదని ధ్వజమెత్తారు. నల్లగొండ, దక్షిణ తెలంగాణను ఎడారి చేసింది.. కేసీఆరే అని గరం అయ్యారు. 13న నల్లగొండ పట్టణ చౌరస్తాల్లో కూర్చి వేసి పింక్ టవల్ వేసి కేసీఆర్ బొమ్మ పెట్టి రైతులతో నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. జగన్ తో కేసీఆర్.. కుమ్మక్కై కృష్ణా జలాలను ఏపికి ధారాదత్తం చేశాడని మండిపడ్డారు. మునిగిపోయే ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ప్రాజెక్ట్ ల పేరుతో కేసీఆర్ ప్రజలను మోసం చేశారని అన్నారు. కాంగ్రెస్ బడ్జెట్ ను విమర్శించే వారంతా మూర్ఖులే అని స్పష్టం చేశారు. బడ్జెట్ ను విమర్శిస్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ప్రజలు అసహ్యించుకున్నారని అన్నారు. బతుకమ్మ బతుకమ్మ అంటూ డిల్లీకి వెళ్లి లిక్కర్ అమ్మిన ఘనురాలు కవిత అని చురకలు అంటించారు. ALSO READ: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్… కాంగ్రెస్‌లోకి బొంతు రామ్మోహన్? కూర్చి వేసి పింక్ టవల్ వేసి కేసీఆర్ బొమ్మ పెట్టి రైతులతో నిరసన వ్యక్తం చేస్తాం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్...👇👇 👉 ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ నల్లగొండకు రావాలి. 👉 నల్లగొండకు కేసీఆర్ ఏ మొహం పెట్టుకొని వస్తున్నాడు..? 👉 కృష్ణా జలాలపై… pic.twitter.com/Ub1i4h7Z69 — Congress for Telangana (@Congress4TS) February 11, 2024 DO WATCH: #kcr #cm-revanth-reddy #kavitha #brs-party #komatireddy-venkat-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి