Chennai : ప్రముఖ కోలీవుడ్(Kollywood) నటుడు డేనియల్ బాలాజీ(Daniel Balaji) హఠాన్మరణం చెందారు. శుక్రవారం అర్థరాత్రి గుండెపోటు(Heart Attack) తో మరణించారు. ఛాతిలో నొప్పి వస్తుందంటూ తీవ్ర అస్వస్థతకు గురైన బాలాజీని కుటుంబసభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
శనివారం అంత్యక్రియలు..
చెన్నైలోని పురసామివాకంలో శనివారం బాలాజీ అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. బాలాజీ హఠాన్మరణంతో తమిళ చిత్రసీమలో విషాదం నెలకొంది. బాలీజీ మరణం తమను షాకింగ్‌కు గురిచేసిందని పలువురు ప్రముఖులు సంతానం తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి : Tripti Dimri: బోల్డ్‌నెస్, అమాయకత్వంతోనే ఆ క్యారెక్టర్ సక్సెస్ అయింది!
విలన్ గా ఫేమస్..
ఈ మేరకు ‘చిట్టి’(Chitti) అనే తమిళ సీరియల్‌తో డేనియల్ బాలాజీ యాక్టింగ్ కెరీర్ మొదలైంది. విలన్ గా ఫేమస్ అయిన బాలాజీ తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడలోనూ సినిమాలు చేశారు.
చివరగా గత ఏడాది అరియవాన్ అనే తమిళ సినిమాలో కనిపించాడు డేనియల్ బాలాజీ. అతడు కీలక పాత్రలు పోషించిన పలు తమిళ సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి. ఎన్టీఆర్ సాంబ సినిమాతో టాలీవుడ్(Tollywood) లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. వెంకటేష్ ఘర్షణ మూవీలో హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ఒకరిగా కనిపించాడు. రామ్‌చరణ్ చిరుత, నాగచైతన్య సాహసం శ్వాసగా సాగిపో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.