Madhya Pradesh New CM : తెలివితేటలతో రాజకీయాల్లో.. హిందుత్వ పునాదులతో ముఖ్యమంత్రి

తెలివి ఎంత ఉందో..హిందూత్వ పునాదులుకూడా అంతే గట్టిగా ఉన్నాయి. కత్తులతో, డిగ్రీలతో మధ్యప్రదేశ్ భవితవ్యాన్ని మార్చేయడానికి వచ్చారు అక్కడి కొత్త ముఖ్యమంత్రి మోహన్ యాదవ్. అనూహ్యంగా సీఎం అయిన మోహన్ యాదవ్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి.

New Update
Madhya Pradesh New CM : తెలివితేటలతో రాజకీయాల్లో.. హిందుత్వ పునాదులతో ముఖ్యమంత్రి

Mohan Yadav : మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి(Madhya Pradesh CM) ఎవరనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. అనూహ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పార్టీ నేత, ఉజ్జయిని ఎమ్మెల్యే మోహన్‌ యాదవ్‌(Mohan Yadav) ను ఎంపిక చేసింది. ఈ మేరకు ఆయన్ను పార్టీ శాసనసభా పక్ష నేతగా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అప్పటి వరకు ఈయన సీఎం రేసులో కూడా లేరు. భోపాల్‌లో బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన పార్టీ లెజిస్లేటివ్‌ భేటీ అనంతరం ఈ ప్రకటన చేసింది. తాజా ఎన్నికల్లో దక్షిణ ఉజ్జయిని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు మోహన్‌ యాదవ్‌.

Also read:ఊహలకందని ముఖ్యమంత్రుల ఎంపిక.. బీజేపీ గేమ్ ప్లాన్ అదిరింది

మోహన్‌ యాదవ్‌.. 25 మార్చి 1965లో ఉజ్జయినిలో జన్మించారు. 58 ఏళ్ల మోహన్‌ యాదవ్‌ సరిగ్గా పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2013లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో గెలిచి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2020లో శివరాజ్‌ సింగ్ చౌహన్‌ ప్రభుత్వం ఆయనను కేబినెట్‌ మంత్రిగా నియమించింది. ఉన్నత విద్యాశాఖ బాధ్యతలు అప్పగించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన.. వరుసగా మూడోసారి విజయం సాధించారు. మోహన్‌ యాదవ్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌తో మంచి అనుబంధం ఉంది.

మోహన్ యాదవ్ బాగా చదువుకున్నవారు. రాజకీయాల్లోకి రాకముందు లాయర్ వృత్తిలో చేసిన ఈయన ఎమ్ఏ పొలిటికల్ సైన్స్, పీహెచ్డీ, ఎమ్బీఏ కూడా చేశారు. రాజకీయ వేత్తగా కూడా ఈయనకు మంచి అనుభవం ఉంది. మోహన్ యాదవ్ కు హిందూత్వం మీద నమ్మకం ఎక్కువ. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు రామ్ చరిత్ మానస్ను అండర్ గ్రాడ్యుయేట్ లో ఒక పాఠం కింద పెట్టారు. అలాగే రామ్ సేతు నిర్మాణంలో ఉన్న గొప్పదనాన్ని కూడా పిల్లలకు పాఠాలుగా చెప్పాలని ఆదేశించారు. ప్రతీ కాలేజ్ లోనూ రామ్చరిత్ మానస్, యోగాలను తప్పనిసరి చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి స్టూడెంట్ డివలప్ మెంట్ లో చాలా ఉపయోగపడతాయని మోహన్ యాదవ్ భావించారు.

యాదవ్ రాజకీయ నాయకుడు కాకముందు ఏబీవీపీ కార్యకర్తగా అనేక పదవులను చేపట్టారు. స్టూడెంట్ యూనియన్ లీడర్ గా, జాయింట్ సెక్రటరీగా, ఏబీవీపీ నేషనల్ పెక్కటరీగా కూడా పని చేశారు. ఆ తరువాత ఆర్ఎస్ఎస్ లో యాక్టివ్ మెంబర్ అయ్యారు. ఆ టైమ్ లో మధ్యప్రదేశ్ డెవలప్ మెంట్ కు సంబంధించిన విషయాల్లో మోహన్ చురుగ్గా పాల్గొనేవారు. అదే ఆయనకు బీజేపీ పార్టీ టికెట్ వచ్చేలా చేసింది.

మోహన్ యాదవ్ లో మరో టాలెంట్ కూడా ఉంది. ఈయన కత్తి, కర్ర సాములో కూడా నేర్పరి. ఈయన మధ్యప్రదేశ్ ఒలింపిక్స్ అసోసియేషన్ కు వైస్ ప్రెసిడెంట్ గా, రెజ్లింగ్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్గా కూడా పని చేశారు. మోహన్ యాదవ్ అంటే ఆయన స్నేమితులకు చాలా ఇష్టమట. మోహన్ ను చూసి తాము చాలా నేర్చుకున్నామని వారు చెబుతారు. మోహన్ తన జీవితంలో ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగారు. కానీ ఆయన చెవులు మాత్రం ఎప్పుడూ నేలను తాకుతూనే ఉంటాయి అని అంటున్నారు. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగఇ ఉండే గుణం మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ది అని పొగుడుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు