Madya Pradesh : ఛత్తీస్‌గఢ్ ముగిసింది.. ఈరోజు మధ్యప్రదేశ్‌లో సీఎం ఎంపికపై భేటీ.. మధ్యప్రదేశ్‌లో ఈరోజు ముఖ్యమంత్రి ఎంపికపై కీలక భేటీ జరగనుంది. సాయంత్రం భోపాల్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహన్‌ను కొనసాగిస్తారా లేదా కొత్త వారికి అవకాశమిస్తారా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. By B Aravind 11 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Who Is The CM In Madhya Pradesh : ఇటీవల జరిగిన ఐదు అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో బీజేపీ విజయ భేరి మోగించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి ఈ మూడు రాష్ట్రాల్లో ఎవరు ముఖ్యమంత్రులు అవుతారు అనేది అక్కడి ప్రజల్లో తీవ్ర ఉత్కంఠను రేపింది. సీఎం అభ్యర్థులను ఎంపిక చేసేందుకు అధిష్ఠానం గత కొన్ని రోజులుగా మంతనాలు జరుపుతూనే ఉందియ అయితే నిన్న (ఆదివారం) ఛత్తీస్‌గడ్‌లో.. సీనియర్ నేత విష్ణుదేవ్ సాయిని ముఖ్యమంత్రిగా ప్రకటించింది బీజేపీ హైకమాండ్. ఛత్తీస్‌గడ్‌కు మూడు సార్లు సీఎంగా పనిచేసిన మరో సీనియర్ నేత రమణ్‌సింగ్‌కు స్పీకర్ పదవి, అలాగే ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు కేటాయించింది. అయితే ఈరోజు మధ్యప్రదేశ్(Madhya Pradesh) లో ముఖ్యమంత్రి ఎంపికపై కీలక భేటీ జరగనుంది. Also Read: ఆర్టికల్ 370పై నేడు సుప్రీం తీర్పు.. ప్రతి ఒక్కరూ తీర్పును గౌరవించాల్సిందేనన్న బీజేపీ..!! సాయంత్రం భోపాల్(Bhopal) లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. దీంతో ఢిల్లీ నుంచి పార్టీ పరిశీలకుల బృందం అక్కడికి బయలుదేరింది. అయితే బృందంలో బీజేపీ ఎంపీ డా.కే లక్ష్మణ్ కూడా ఉన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహన్‌ను కొనసాగించాలా లేదా కొత్త వారికి అవకాశమివ్వాలా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో 15 ఏళ్లుగా పనిచేసిన రమణ్‌సింగ్‌ను పక్కన పెట్టి.. విష్ణుదేవ్ సాయికి అవకాశం ఇచ్చారు. అయితే మధ్యప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌహన్ సీఎంగా పనిచేశారు కాబట్టి.. ఇక్కడ కూడా వేరే వాళ్లకి సీఎం పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎవరు సీఎం అవుతారో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. Also Read : ISనెట్ వర్క్ కేసులో ఎన్ఐఏ దూకుడు..బెంగుళూరు వ్యాపారవేత్తతో సహా పలువురు అరెస్ట్..!! #madyapradesh #madhya-pradesh #delhi #bhopal #madyapradesh-cm #shivaraj-singh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి