Kishan Reddy: కాంగ్రెస్ హయాంలో రూ.12 లక్షల కోట్లు దోపిడీ చేశారు: కిషన్ రెడ్డి

యూపీఏ ప్రభుత్వం హయాంలో దేశంలో రూ.12 లక్షల కోట్లు దోపిడి చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆ సమయంలో మంత్రులు జైల్లో ఉన్నారంటూ విమర్శించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి బీఆర్‌ఎస్‌ అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు.

Kishan Reddy : బీజేపీ గెలవొద్దని కుట్రలు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
New Update

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలపై తీవ్రంగా విమర్శలు చేశారు. యూపీఏ ప్రభుత్వం హయాంలో దేశంలో రూ.12 లక్షల కోట్లు దోపిడి చేశారని ఆరోపించారు. ఆ సమయంలో మంత్రులు జైల్లో ఉన్నారంటూ విమర్శించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌గా నిర్మించుకుందామని పిలుపునిచ్చారు.

Also Read: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌కు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే..

భారత్‌ నవ్వులపాలైంది

కాంగ్రెస్ గెలిచేది లేదు.. ఇచ్చిన హామీలు అమలు చేసేది లేదంటూ ఎద్దేవా చేశారు. హస్తం పార్టీకి ఓటు వేసే పరిస్థితి దేశంలో లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడల్లా దేశంలో ఉగ్రవాదం పెరిగిందని.. ప్రపంచ దేశాల ముందు భారత్‌ నవ్వులపాలైందన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి బీఆర్‌ఎస్‌ అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు.

బీఆర్‌ఎస్ మునిగిపోయే పార్టీ

ఇదిలాఉండగా.. బీజేపీ మాజీ ఎమ్మల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి వస్తున్నారని అన్నారు. భారత్ సురక్షితంగా ఉండాలంటే.. మోదీ సర్కార్ రావాలని అన్నారు. బీఆర్‌ఎస్‌ మునిగిపోయే పార్టీ అని.. అన్ని సామాజిక వర్గాలకు సమానంగా న్యాయం జరగాలంటే బీజేపీ మంచి వేదిక అని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేయలేని హామీలు ఇచ్చిందని.. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండా అంటూ వ్యాఖ్యానించారు.

భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ... ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భారాస నేతలు భాజపాలోకి చేరుతున్నారన్నారు. దేశం సురక్షితంగా ఉండాలంటే మోదీ ప్రభుత్వం రావాలన్నారు. ‘‘భారాస మునిగిపోయే పార్టీ. అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరగాలంటే భాజపా మంచి వేదిక. కాంగ్రెస్‌ అమలు చేయలేని హామీలు ఇచ్చింది. రాబోయేది భాజపా రాజ్యం. తెలంగాణలో ఎగరబోయేది కాషాయ జెండా’’ అని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: తల్లీకూతుళ్లతో సహజీవనం.. సినిమా ఛాన్స్ ఇప్పిస్తానంటూ వ్యక్తి దారుణం

#brs #telugu-news #telangana-news #congress #bjp-kishan-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe