TS POLITICS : తెలంగాణ కాంగ్రెస్ బూత్ లెవెల్ కన్వెన్షన్లో మోడీపై నిప్పులు చెరిగిన ఖర్గే 

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బూత్ ఏజెంట్ల బాధ్యత అత్యంత కీలకమైనదని కాంగ్రెస్  నాయకులకు, కార్యకర్తలకు ఖర్గే పిలుపునిచ్చారు.ఈ మేరకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ బూత్ లెవెల్ కన్వెన్షన్లో మోడీ పాలనపై నిప్పులు చెరిగారు.

TS POLITICS : తెలంగాణ కాంగ్రెస్ బూత్ లెవెల్ కన్వెన్షన్లో  మోడీపై నిప్పులు చెరిగిన ఖర్గే 
New Update
Telangana Congress booth level convention: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. తెలంగాణలో రేవంత్ సర్కార్ ఈ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రణాళికలు రచిస్తోంది.తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన వెంటనే  ఇచ్చిన హామీలను అమలు చేసే పనిలో ఉంది రేవంత్ సర్కార్ . త్వరలో జరగనున్న  లోక్‌సభ ఎన్నికల్లో తమ సత్తా చాటుకునేందుకు కాంగ్రెస్ పార్టీ శక్తియుక్తులా ప్రయత్నిస్తోంది. అందుకోసం జాతీయ స్థాయినేతలు తెలంగాణ వైపు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన తెలంగాణ కాంగ్రెస్ బూత్ లెవెల్ కన్వెన్షన్" కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే హాజరయ్యారు.

మోడీపై నిప్పులు చెరిగిన ఖర్గే 
రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అందరూ సమిష్టి కృషి చెయ్యాలని  పార్టీ నేతలకు సూచించారు.ఈ  సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బూత్ ఏజెంట్ల బాధ్యత అత్యంత కీలకమైన పని ఉందని కాంగ్రెస్  నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.మీరు చేసిన కృషి ఫలితంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్  అధికారంలోకి వచ్చిందని , ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో రెండు ఇప్పటికే అమలుపరిచామని , మిగిలినవి కూడా ఇచ్చిన మాట ప్రకారమే అమలు చేసేపనిలో ఉన్నామని ఖర్గే అన్నారు. కానీ .. మోడీ  మాత్రం గతంలో మోడీ గ్యారంటీ అని పత్రికల్లో  ప్రకటనలు ఇచ్చారు.రెండు కోట్ల ఉద్యోగాల గ్యారంటీ అన్నారు .. ఏమయ్యాయి ఈ హామీలని నిప్పులు చెరిగారు.
దేశానికి సమస్య వచ్చిన ప్రతీ సారి దేవుళ్లపై  ద్రుష్టి మళ్లిస్తున్న మోడీ - ఖర్గే 
2014 లో అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెనక్కి తీసుకువచ్చి.. ప్రతీ ఒక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి దేశ ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.  ఎన్నో హామీలను ఇచ్చి వాటిని అమలు పరచడంలో బీజేపీ విఫలమైందని ,  దేశంలో ఏ సమస్య వచ్చినా వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు చైనా, పాకిస్థాన్, దేవుళ్ల పేర్లు చెప్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశాన్ని విభజించేందుకు బీజేపీ, మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. ఏకం చేయడానికి రాహుల్ గాంధీ యాత్రలు చేస్తున్నారని తెలిపారు.ప్రజలంతా బాగుండాలని రాహుల్ గాంధీ యాత్ర  చేస్తున్నారని ,  ప్రజలకు న్యాయం కోసం యాత్ర చేస్తున్నారని , యువత, మహిళ, దళిత, గిరిజన ప్రజల కోసం ఆయన కష్టపడుతున్నారని రాహుల్క సేవలను కొనియాడారు.గతంలో కన్యాకుమారి నుంచి  కాశ్మీర్‌కు భారత్ జోడో యాత్ర నిర్వహించగా.. ప్రస్తుతం మణిపూర్ నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్రను చేపట్టారని గుర్తు చేశారు. మోడీ దేశానికి ఏం చేశారని ప్రశ్నించారు. వీటన్నిపై రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మోడీ అన్ని హామీలపై ప్రశ్నిస్తామని అన్నారు. దేశంలో  రైతులకు పనులు లేవు , యువతకు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని , పనిలేకపోతే తిండి ఎలా దొరుకుతుందని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ నాయకులంతా చాలా జాగ్రత్త
మీ సమష్టి కృషి ఫలితంగా తెలంగాణాలో  కష్టపడి ఎలాంటి ఫలితాలు తెచ్చారో.. దేశంలో కూడా అలాంటి ఫలితాలు తేవాలని , తెలంగాణాలో ప్రభుత్వ పనితీరు, రేవంత్ రెడ్డి పనితీరు ఆదర్శంగా ఉందని కొనియాడారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో  చాలా బలంగా ఉందని, మోడీ , అమిత్ షా లు ఎక్కడ బలహీనంగా ఉంటే అక్కడ ప్రభుత్వాలు పడగొడతారని .. అందుకే చాలా సమిష్టిగా పని  చెయ్యాలని పిలుపునిచ్చారు. మోడీ, షాలు ఈడీ, సిబిఐ, ఐటి లను ఉపయోగించి దాడులు చేసే  ప్రమాదం ఉందని , సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ నాయకులంతా చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బీజేపీ ఎంతభయపెట్టాలని చూసినా తెలంగాణలో ఎవరూ భయపడరని బీజేపీని  ఎద్దేవా చేసారు. మనం ప్రజల మధ్య ఉంటే గెలుస్తాం.. లేకపోతే ఓడిపోతాం అని ఆనాడు నెహ్రూ  అన్నమాటలను గుర్తుచేశారు.  క్షేత్ర స్థాయి లో పనులు చేస్తే విజయం ఖచ్చితగా  సాధిస్తామని కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహపరిచారు.
పదేళ్ళలో 155 లక్షల కోట్ల అప్పులు చేసిన మోడీ 
రైతుల కష్టాలు మోడీకి తెలియవని , రైతులను మోసం చేశారని దీంతొ  రైతులు  ఆత్మహత్య లు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ పదేళ్ళలో 155 లక్షల కోట్ల అప్పులు చేసి , దేశాన్ని అప్పుల్లో ముంచారని మండిపడ్డారు. ఈ సారి ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. అందుకోసం బూత్ కమిటీలు జాగ్రత్తగా ఉండీ కష్టపడి కాంగ్రెస్ ను గెలిపించాలని కాంగ్రెస్ నేతలు పిలుపు నిచ్చారు.
#modi #ts-politics #chief-minister-revanth-reddy #telangana-congress-booth-level-convention #telangana-congress #mallikharjuna-kharge #rahul-gandhi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe