CBN : చంద్రబాబు కోసం ఐదేళ్లుగా సొంతంటికి దూరమైన మహిళ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధించి సీఎం అవుతారని చేసిన ఛాలెంజ్ ఓడిన మహిళ ఐదేళ్లపాటు పుట్టింటికి దూరమయ్యారు. తాజాగా చంద్రబాబు ఏపీ సీఎం కావడంతో స్వగ్రామానికి వెళ్లారు. By Bhavana 17 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Chandrababu : సాధారణంగా ఎన్నికల సమయంలో నేతలు గెలుస్తారని, ఓడిపోతారని పందేలు కడుతుంటారు. కొందరు పందేల్లో లక్షలకు లక్షలు పొగొట్టుకుంటుంటారు. అయితే ఖమ్మం జిల్లా (Khammam) లో మాత్రం ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహిత ఏపీ ఎన్నికల (AP Elections) పై కాసిన పందెం తన పుట్టింటికి ఐదేళ్లపాటు వెళ్లకుండా ఆపింంది. తాజాగా ఐదేళ్ల తరువాత మరుసటి ఎన్నికల్లో తన ఛాలెంజ్ నెగ్గడంతో పుట్టింటికి వచ్చిన ఆమెకు స్థానికులతో పాటు కుటుంబసభ్యులు ఘన స్వాగతం పలికారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన మహిళ కట్టా విజయలక్ష్మీ అనే 2019 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు సీఎం (CM Chandrababu) అవుతారని అన్నారు. కుటుంబసభ్యలతో చెప్పగా వారు ఆమె మాట నమ్మలేదు.దాంతో చంద్రబాబు సీఎం అవుతారని విజయలక్ష్మీ పందెం కట్టారు. కచ్చితంగా వైఎఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని కుటుంబసభ్యులు సైతం పందెం కాశారు. ఒకవేళ తాను కాసిన పందెంలో ఓడితే పుట్టింటికి రానని, చంద్రబాబు గెలిచాకే అడుగుపెడతానని ఆమె ఛాలెంజ్ చేశారు. 2019 ఎన్నికల్లో నెగ్గి జగన్ సీఎం కావడంతో పందెం ఓడిన విజయలక్ష్మీ గత ఐదేళ్ల నుంచి పుట్టింటికి రావడం మానేశారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. . ఈ ఎన్నికల్లో తాను నెగ్గడంతో ఐదేళ్ల తరువాత సొంత గ్రామం కేశవాపురం వచ్చారు విజయలక్ష్మీ. శపథం నెరవేరడంతో ఐదేళ్ల తరువాత పుట్టింటికి వచ్చిన ఆమెకు గ్రామస్థులు, కుటుంబసభ్యులు ఘనస్వాగతం పలికారు. శపథం నెరవేరడంతో ఆమెను ఘనంగా సత్కరించారు. గ్రామంలోకి అడుగుపెట్టిన విజయలక్ష్మీ దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం తన పుట్టింటికి వెళ్లారు. ప్రస్తుతం ఈ విషయం ఖమ్మం జిల్లాలో వైరల్ అవుతోంది. విషయం తెలిసిన కొందరు ఇదెక్కడి అభిమానం రా నాయనా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. Also Read : తెలంగాణలో ఐదు రోజుల పాటు వానలే వానలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్! #ap-cm-chandrababu #khammam #ycp #tdp #jagan #kusumanchi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి