Kenya: ఆఫ్రికా దేశమైన కెన్యాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఓ డ్యామ్ కూలి సుమారు 42 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం గురించి స్థానిక అధికారులు సమాచారం అందించారు. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు రావడంతో దేశంలోని పలు డ్యామ్ లు, నదులు నిండి ప్రమాదకరస్థాయిలో ప్రవాహిస్తున్నాయి.
దీంతో కొన్ని చోట్ల నీటి ఉద్దృతికి డ్యాములు కొట్టుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పశ్చిమ కెన్యాలోని రిఫ్ట్ వ్యాలీ లో గల కిజాబె డ్యామ్ నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయింది. దీంతో వరద నీరంతా దిగువ గ్రామాల్లోకి పోటెత్తడంతో ఆ నీటి ప్రవాహానికి సుమారు 42 మంది కొట్టుకుపోయారు. వారంతా కూడా మరణించినట్లు నకురు కౌంటీ గవర్నర్ సుసాన్ కిహికా వివరించారు.
నీటి ఉద్ధృతికి పలు ఇళ్లు, రోడ్లు కూడా కొట్టుకుపోయాయని, బుదరలో మరికొంత మంది చిక్కుకుపోయినట్లు చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక భారీ వర్షాలకు గత నెలలో సుమారు 100 మంది మరణించినట్లు సమాచారం.
Also read: ఘోర బస్సు ప్రమాదం..లోయలో పడి 23 మంది మృతి!